Good Bad Ugly Day 1 Collections: గుడ్ బ్యాడ్ అగ్లీ డే1 కలెక్షన్స్.. అజిత్ రచ్చ.. ఎన్ని కోట్లంటే?
తమిళ స్టార్ హీరో అజిత్, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ జంటగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఏప్రిల్ 10న ఈ యాక్షన్ కామెడీ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. అదిక్ రవిచంద్రన్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కింది. నవీన్ ఏర్నెనీ, వై రవి శంకర్ నిర్మాతలుగా వ్యహరించారు. ఈ మూవీని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఓవర్సీస్ లో గ్రాండ్ విడుదల చేశారు. ఇక ఈ చిత్రం బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్, మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..
గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం బడ్జెట్ (Good Bad Ugly Budget) ఎంత?
అజిత్, త్రిష కృష్ణన్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం అత్యాధునిక టెక్నాలజీ తో నిర్మించారు. హై స్టాండర్డ్, ఎపిక్యూ ఫార్మాట్ లో రూపొందించారు. ఈ చిత్రం కోసం భారీ తాగాణం, టాప్ టెక్నీషియన్లు పనిచేయడం, పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడం, మరోవైపు ప్రమోషన్స్ ను గట్టిగా నిర్వహించడం కారణంగా భారీగానే ఖర్చైంది. చిత్ర నిర్మాణ ఖర్చులు, రెమ్యునరేషన్లు కలుపుకొని రూ.300 కోట్ల వరకు బడ్జెట్ ఖర్చైంది.

గుడ్ బ్యాడ్ అగ్లీ బ్రేక్ ఈవెన్ (Good Bad Ugly Break Even Target) టార్గెట్ ఎంత?
గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. అజిత్ కు ఉన్న మార్కెట్ ద్వారా ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా రూ.114 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసందని ట్రేడ్ పండింతులు చెబుతున్నారు. దీంతో అజిత్ సినిమా లాభాల్లోకి రావాలంటే.. రూ.115 కోట్ల షేర్, రూ.230 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు. రొమియోక్చర్స్ తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ని, కేవీఎన్ ప్రొడక్షన్స్ కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌ని, శ్రీగోకులం మూవీస్ కేరళ థియేట్రికల్ రైట్స్‌ని, ప్రత్యంగిరా సినిమాస్ యూఎస్ థియేట్రికల్ రైట్స్‌ని భారీ రేటుకు దక్కించుకోవడం విశేషం.
గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రీ సేల్ కలెక్షన్లు (Good Bad Ugly Collections)
అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని తమిళనాడులో 2400 స్క్రీన్స్, వరల్డ్ వైడ్ గా రూ.3000 థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరిగాయి. ఫలితంగా ప్రీ సేల్స్ లో 29.75 కోట్ల గ్రాస్ ను అందుకుంది. తమిళ నాడులో రూ.17.30 కోట్లు, ఇండియా వ్యాప్తంగా రూ.20.30 కోట్లు, ఓవర్సీస్ లో రూ.9.45 కోట్ల చొప్పున అడ్వాన్స్ బుకింగ్స్ ను అందుకుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
గుడ్ బ్యాడ్ అగ్లీ ఓపెనింగ్ డే కలెక్షన్స్ (Good Bad Ugly Day 1 Collections)
గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి తొలిరోజు ఓవరాల్ గా 79.47 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది. తమిళనాడులోని కొన్ని మెయిన్ సెంట్స్ లో 924 షోలకు 95 శాతం ఆక్యుపెన్సీని సొంతం చేసుకుందని సాక్ నిల్క్ రిపోర్ట్ అందించింది. దీంతో మొదటి రోజు కలెక్షన్లు కూడా భారీగానే అందాయి. గుడ్ బ్యాడ్ అగ్లీ 1వ రోజు ఇండియా నెట్ 28.50 కోట్లు వసూళ్లు చేసిందని సాక్ నిల్క్ గణంకాలు చెబుతున్నాయి. దీంతో ఇండియా గ్రాస్ రూ.45 కోట్లు + ఓవర్సీస్ లో రూ.16 కోట్లు, మిగితా వసూళ్లు కలుపుకొని వరల్డ్ వైడ్ గా రూ.70 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు అందుకుందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.


Click it and Unblock the Notifications











