Good Bad Ugly Day 1 Collections : అజిత్ సంచలనం.. గుడ్ బ్యాడ్ అగ్లీకి రికార్డ్ ఓపెనింగ్స్.. ఎన్ని కోట్లంటే?

అజిత్ కుమార్, త్రిష కృష్ణన్ జంటగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ . సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అజిత్ సినిమా తొలి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో చూస్తే :

Good Bad Ugly Day 1 Collections Worldwide here is the Ajith Kumar s Movie day 1 Expected box office report

గడ్ బ్యాడ్ అగ్లీ బడ్జెట్ బడ్జెట్ ఎంత (Good Bad Ugly Budget)?

ప్రభు, అర్జున్ దాస్, ప్రసన్న, సునీల్, రాహుల్ దేవ్, యోగి బాబు, ప్రియా ప్రకాష్ వారియర్, టామ్ చాకో తదితరులు గుడ్ బ్యాడ్ అగ్లీలో కీలకపాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీత సారథ్యం వహించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ , ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి గుడ్ బ్యాడ్ అగ్లీకి భారీ బడ్జెట్ అయ్యింది. ఈ సినిమాను దాదాపు రూ.270 కోట్ల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

గడ్ బ్యాడ్ అగ్లీ ఈవెన్ టార్గెట్ ఎంత (Good Bad Ugly Break Even Target)?

అజిత్ క్రేజ్ దృష్ట్యా .. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్‌కు కళ్లు చెదిరే బిజినెస్ జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం , రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్ కలిపి ప్రపంచవ్యాప్తంగా గుడ్ బ్యాడ్ అగ్లీకి రూ.114 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. రొమియోక్చర్స్‌ తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ని, కేవీఎన్ ప్రొడక్షన్స్ కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌ని, శ్రీగోకులం మూవీస్ కేరళ థియేట్రికల్ రైట్స్‌ని, ప్రత్యంగిరా సినిమాస్ యూఎస్ థియేట్రికల్ రైట్స్‌ని భారీ రేటుకు దక్కించుకున్నాయి. అంటే అజిత్ సినిమా లాభాల్లోకి రావాలంటే.. రూ.115 కోట్ల షేర్, రూ.230 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

గుడ్ బ్యాడ్ అగ్లీ కలెక్షన్లు (Good Bad Ugly Collections)

జాక్ సినిమాను తమిళనాడులో 2400 స్క్రీన్‌లలో , ప్రపంచవ్యాప్తంగా 3000 థియేటర్లకు పైగా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో అజిత్ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం ప్రీ సేల్స్‌లోనే గుడ్ బ్యాడ్ అగ్లీ రూ.29.75 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులు నమోదు చేసింది. తమిళనాడులో రూ.17.30 కోట్లు, ఇండియా వైడ్ రూ.20.30 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.9.45 కోట్లు చొప్పున అడ్వాన్స్‌గానే కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.

గుడ్ బ్యాడ్ అగ్లీ తొలి రోజు కలెక్షన్స్ అంచనా ( Good Bad Ugly Day 1 Expected Collections)

మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న గుడ్ బ్యాడ్ అగ్లీ.. సాయంత్రం 4 గంటల వరకు తమిళ వెర్షన్‌కు 77.14 శాతం, తెలుగు వెర్షన్‌కు 15.71 శాతం ఆక్యూపెన్సీ నమోదు చేసినట్లు సాక్‌నిల్క్ వెబ్‌సైట్ వెల్లడించింది. ఫస్ట్ షో, సెకండ్ షోలకు కూడా మంచి బుకింగ్స్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. సాయంత్రం 5.30 గంటల వరకు గుడ్ బ్యాడ్ అగ్లీ ఇండియా వైడ్ రూ.18.57 కోట్ల నికర వసూళ్లు రాబట్టినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. దీంతో అజిత్ చిత్రం తొలి రోజు రికార్డు స్థాయిలో రూ.48 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే ఇది రూ.50 కోట్ల పైనే ఉంటుందని చెబుతున్నారు. చూద్దాం మరి అజిత్ ఎలాంటి మేజిక్ చేస్తాడో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X