Good Bad Ugly Day 15 Collections : ఇదీ అజిత్ క్రేజ్.. గుడ్ బ్యాడ్ అగ్లీ 15 రోజుల కలెక్షన్స్
15 రోజులుగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రానికి బాక్సాఫీస్ వద్ద జోరుగా వసూళ్లు అందుతున్నాయి. 3వ వారంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రం రోజుకు రూ.1.5 కోట్లకు పైగా వసూళ్లను సాధిస్తోంది. ఈ చిత్రంలో తమిళ అగ్ర హీరో అజిత్ కుమార్, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ జంటగా నటించారు. ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై టాలీవుడ్ అగ్ర నిర్మాతలు నవీన్ ఏర్నెనీ, వై రవి శంకర్ నిర్మించారు. సిమ్రాన్ కామియో అప్పీయరెన్స్ ఇచ్చింది. ఈ చిత్రం బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్, 15 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..
గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం బడ్జెట్ (Good Bad Ugly Budget) ఎంత?
అజిత్ 63వ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీని హై స్టాండర్డ్, ఎపిక్యూ ఫార్మాట్ లో టాప్ టెక్నాలజీతో నిర్మించారు. అజిత్, త్రిష కృష్ణన్ తోపాటు భారీ తాగాణం, టాప్ టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పని చేశారు. దీంతో సినిమాకు బాగానే ఖర్చైంది. నిర్మాణ ఖర్చులు, రెమ్యునరేషన్లు, ప్రమోషన్స్ కలుపుకొని రూ.300 కోట్ల వరకు బడ్జెట్ అయ్యింది.

గుడ్ బ్యాడ్ అగ్లీ బ్రేక్ ఈవెన్ (Good Bad Ugly Break Even Target) టార్గెట్ ఎంత?
ఈ చిత్రానికి భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ద్వారా వరల్డ్ వైడ్ రూ.114 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. దీంతో సినిమా లాభాల్లోకి రావాలంటే.. రూ.115 కోట్ల షేర్, రూ.230 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.
గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రీ సేల్ కలెక్షన్లు (Good Bad Ugly Collections)
అజిత్ సినిమాకు ముందు నుంచే భారీ డిమాండ్ ఉండటంతో తమిళనాడులో 2400 స్క్రీన్స్, వరల్డ్ వైడ్ గా 3000 థియేటర్లలో విడుదలైంది. ప్రీ సేల్స్ లో రూ.29.75 కోట్ల గ్రాస్ ను అందుకుంది. తమిళనాడులో రూ.17.30 కోట్లు, ఇండియా వైడ్ గా రూ.20.30 కోట్లు, ఓవర్సీస్ లో రూ.9.45 కోట్ల చొప్పున అడ్వాన్స్ బుకింగ్స్ ను అందుకుందని ట్రేడ్ లెక్కలు వివరించాయి.
గుడ్ బ్యాడ్ అగ్లీ గత 14 రోజుల కలెక్షన్స్ (Good Bad Ugly 6 Days Collections)
డే1న ఇండియా నెట్ 29.25 కోట్లు వసూళ్లైంది. ఇండియా + ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకొని వరల్డ్ వైడ్ గా మొదటి రోజు రూ.51.40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. 2వ రోజు ఇండియా నెట్ రూ.15 కోట్లు, ఇండియా గ్రాస్ 18 కోట్లు, 3వ రోజు రూ.20.79 కోట్ల ఇండియా నెట్, ఇండియా గ్రాస్ రూ.23 కోట్ల వసూల్ చేసింది. 4వ రోజు ఇండియా నెట్ రూ.22.3 కోట్లు, 5వ రోజు ఇండియా నెట్ రూ.15 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.21 కోట్లు, 6వ రోజు రూ.7 కోట్ల ఇండియా నెట్, గ్రాస్ రూ. 8.50 కోట్లు వసూల్ చేసింది. ఇక 7వ రోజు 5.50 కోట్ల ఇండియా నెట్ అందుకుంది. 8వ రోజు రూ.5.28 కోట్లు, 9వ రోజు రూ.5.67, 10వ రోజు రూ.6 కోట్లు, 11వ రోజు 6.8 కోట్లు, 12వ రోజు రూ.2.45 కోట్లు, 13వ రోజు రూ.1.79 కోట్లు, 14వ రోజు రూ.1.44 కోట్ల నెట్ వసూల్ చేసిందని సాక్ నిల్క్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఓవర్సీస్ డే15 కలెక్షన్లు (Good Bad Ugly Overseas Day 15 Collections)
అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి ఓవర్సీస్ లోనూ మంచి రెస్పాన్స్ దక్కింది. మొదటి రోజు ఓవర్సీస్ లో రూ.17 కోట్ల గ్రాస్, 2వ రోజు రూ.8 కోట్లు, 3వ రోజు ఏకంగా రూ.12.50 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. 4వ రోజు రూ.11.25 కోట్ల వరకు ఓర్సీస్ కలెక్షన్లు సాధించింది. 5, 6 రోజు కలిసి రూ.4.5 కోట్లు కలెక్షన్లు అందుకుంది. ఇక 15 రోజుల వరకు ఓవర్సీస్ లో 62.1 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని సాక్ నిల్క్ రిపోర్ట్ తెలిపింది.
గుడ్ బ్యాడ్ అగ్లీ 15వ రోజు కలెక్షన్స్ (Good Bad Ugly Day 15 Collections)
15వ రోజు గురువారం వర్కింగ్ డే అయినప్పటికీ బాక్సాఫీస్ కలెక్షన్ల జోరుగానే అందాయి. ఇండియాలో రూ.1.29 కోట్ల వరకు నెట్ వసూల్ చేసింది. ఇండియా + ఓవర్సీస్ కలుపుకొని రూ.3 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక మొత్తం 15 రోజుల్లో ఈ చిత్రం ఇండియా నెట్ రూ.144.67 కోట్లకు చేరుకుంది. రూ.164.9 కోట్ల ఇండియా గ్రాస్ అందుకుంది. ఓవర్సీస్ లో రూ.62.1 కోట్లు కలెక్ట్ చేసింది. ఇండియా + ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకొని వరల్డ్ వైడ్ గా రూ.227 కోట్ల గ్రాస్ వసూల్ చేసినట్టుగా సాక్ నిల్క్ బాక్సాఫీస్ రిపోర్ట్ అందించింది. మూడోవ వారంలోనూ ఈ చిత్రం రూ.1కోటీకి తగ్గకుండా వసూళ్లు చేస్తుండటం విశేషం. థర్డ్ వీక్ తో అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి కానుంది.


Click it and Unblock the Notifications











