Good Bad Ugly Day 2 Collections: గుడ్ బ్యాడ్ అగ్లీ డే2 కలెక్షన్స్.. అజిత్ కు బిగ్ షాక్.. 2వ రోజే మరీ

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతలు రూపొందించిన చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఏప్రిల్ 10న ఇండియాలోని ఐదు ప్రధాన ప్రాంతీయ భాషలతో పాటు ఓవర్సీస్ లోనూ గ్రాండ్ గా విడుదలైంది. తమిళ అగ్ర హీరో అజిత్, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ జంటగా నటించారు. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. టాలీవుడ్ లోని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కింది. నవీన్ ఏర్నెనీ, వై రవి శంకర్ నిర్మాతలుగా వ్యహరించారు. ఇక ఈ చిత్రం బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్, 2 రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..

గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం బడ్జెట్ (Good Bad Ugly Budget) ఎంత?
తమిళ స్టార్ అజిత్, త్రిష కృష్ణన్ లేటెస్ట్ ఫిల్మ్ గుడ్ బ్యాడ్ అగ్లీ టాప్ టెక్నాలజీతో నిర్మించారు. హై స్టాండర్డ్, ఎపిక్యూ ఫార్మాట్ లో రూపొందించారు. అలాగే భారీ తాగాణం, టాప్ టెక్నీషియన్లు చిత్రం కోసం పనిచేశారు. మరోవైపు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడం, ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహించడం కారణంగా భారీగానే ఖర్చైంది. చిత్ర నిర్మాణ ఖర్చులు, రెమ్యునరేషన్లు కలుపుకొని రూ.300 కోట్ల వరకు బడ్జెట్ ఖర్చైందని టాక్.

Good Bad Ugly Day 2 Collections Worldwide

గుడ్ బ్యాడ్ అగ్లీ బ్రేక్ ఈవెన్ (Good Bad Ugly Break Even Target) టార్గెట్ ఎంత?
అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీకి ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ద్వారా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.114 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని ట్రేడ్ పండింతులు చెబుతున్నారు. దీంతో సినిమా లాభాల్లోకి రావాలంటే.. రూ.115 కోట్ల షేర్, రూ.230 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు. ఇక రొమియోక్చర్స్‌ తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ని, కేవీఎన్ ప్రొడక్షన్స్ కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌ని, శ్రీగోకులం మూవీస్ కేరళ థియేట్రికల్ రైట్స్‌ని, ప్రత్యంగిరా సినిమాస్ యూఎస్ థియేట్రికల్ రైట్స్‌ని భారీ రేటుకు దక్కించుకోవడం విశేషం.

గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రీ సేల్ కలెక్షన్లు (Good Bad Ugly Collections)
అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని తమిళనాడులో 2400 స్క్రీన్స్, వరల్డ్ వైడ్ గా రూ.3000 థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరిగాయి. ఫలితంగా ప్రీ సేల్స్ లో 29.75 కోట్ల గ్రాస్ ను అందుకుంది. తమిళ నాడులో రూ.17.30 కోట్లు, ఇండియా వ్యాప్తంగా రూ.20.30 కోట్లు, ఓవర్సీస్ లో రూ.9.45 కోట్ల చొప్పున అడ్వాన్స్ బుకింగ్స్ ను అందుకుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

గుడ్ బ్యాడ్ అగ్లీ డే2 కలెక్షన్స్ (Good Bad Ugly Opening Day Collections)
గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి ఓపెనింగ్ డేనే ఓవరాల్ గా 79.47 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది. తమిళనాడులోని మెయిన్ సెంట్స్ లో 924 షోలకు 95 శాతం ఆక్యుపెన్సీని నమోదైందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. దీంతో మొదటి రోజు కలెక్షన్లు కూడా భారీగానే అందాయి. గుడ్ బ్యాడ్ అగ్లీ 1వ రోజు ఇండియా నెట్ 29.25 కోట్ల నెట్ అందింది. తమిళంలో రూ.28.15 కోట్ల నెట్, తెలుగులో రూ.1.1 కోట్ల నెట్ అందుకుంది. ఇక ఇండియా గ్రాస్ 34.40 కోట్లు కలెక్ట్ చేసింది. తమిళంలో రూ.30.4 కోట్లు ఓపెనింగ్ డేనే అందుకొని మొదటి రోజునే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులోకి ఎక్కింది. ఇక వరల్డ్ వైడ్ గా ఇండియా + ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకొని రూ.51.40 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇక 2వ రోజు ఇండియా నెట్ రూ.13.50 కోట్ల వరకు వసూళ్లు చేసింది. ఇండియా గ్రాస్ రూ.16 కోట్లు వసూళ్లు చేసిందని ఏర్లీ ఎస్టిమేట్స్ చెబుతున్నాయి. అయితే మొదటి రోజు జోరు చూపించిన ఈ చిత్రం కలెక్షన్లు రెండోవ రోజు మాత్రం భారీగా డ్రాప్ అయ్యాయి. ఆక్యెపెన్సీ కూడా 50శాతం మాత్రమే నమోదైంది. దీంతో ఫస్ట్ వీకెండ్ ఈ చిత్రం కలెక్షన్లు ఎలా ఉంటాయనేది చూడాలి.

ఓవర్సీస్ డే2 కలెక్షన్లు (Good Bad Ugly Overseas Day 2 Collections)

ఓవర్సీస్ లోనూ అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. టాక్ అదిరిపోవడంతో డే1న ఓవర్సీస్ లో రూ.17 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు అందుకుంది. ఇంకా డే2 రూ.5 కోట్ల వరకు కలెక్షన్లు అందుకుందని ట్రేడ్ నిపుణుల అంచనా. మరి ఆ వివరాలు అప్డేట్స్ కావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X