Good Bad Ugly Day 3 Collections: 100 కోట్లతో అజిత్ విధ్వంసం.. గుడ్ బ్యాడ్ అగ్లీ డే3 కలెక్షన్స్ ఎంతంటే?

టాలీవుడ్ నిర్మాతలు రూపొందించిన చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ విడుదలైంది. తమిళ అగ్ర హీరో అజిత్, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ జంటగా నటించారు. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. టాలీవుడ్ లోని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కింది. నవీన్ ఏర్నెనీ, వై రవి శంకర్ నిర్మాతలుగా వ్యహరించారు. జాకీ ష్రాఫ్, సునీల్, అర్జున్ దాస్, యోగి బాబు, ప్రియా ప్రకాష్ వారియర్ ముఖ్య పాత్రలు పోషించారు. సీనియర్ నటి సిమ్రాన్ కీలక పాత్రలో కామియో అప్పీయరెన్స్ ఇచ్చింది. ఈ మూవీ రొమియోక్చర్స్‌ తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ని, కేవీఎన్ ప్రొడక్షన్స్ కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌ని, శ్రీగోకులం మూవీస్ కేరళ థియేట్రికల్ రైట్స్‌ని, ప్రత్యంగిరా సినిమాస్ యూఎస్ థియేట్రికల్ రైట్స్‌ని భారీ రేటుకు దక్కించుకోవడం విశేషం. ఇక ఈ చిత్రం బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్, 2 రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..

గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం బడ్జెట్ (Good Bad Ugly Budget) ఎంత?
లేటెస్ట్ ఫిల్మ్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాన్ని టాప్ టెక్నాలజీతో నిర్మించారు. హై స్టాండర్డ్, ఎపిక్యూ ఫార్మాట్ లో రూపొందించారు. అలాగే అజిత్, త్రిష కృష్ణన్ తోపాటు భారీ తాగాణం, టాప్ టెక్నీషియన్లు చిత్రం కోసం పనిచేశారు. ప్రమోషన్స్ ను కూడా జోరుగా నిర్వహించడం కారణంగా భారీగానే ఖర్చైంది. నిర్మాణ ఖర్చులు, రెమ్యునరేషన్లు కలుపుకొని రూ.300 కోట్ల వరకు బడ్జెట్ ఖర్చైంది.

Good Bad Ugly Day 3 Collections Worldwide

గుడ్ బ్యాడ్ అగ్లీ బ్రేక్ ఈవెన్ (Good Bad Ugly Break Even Target) టార్గెట్ ఎంత?

అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీకి ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ద్వారా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.114 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని ట్రేడ్ పండింతులు చెబుతున్నారు. దీంతో సినిమా లాభాల్లోకి రావాలంటే.. రూ.115 కోట్ల షేర్, రూ.230 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు.

గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రీ సేల్ కలెక్షన్లు (Good Bad Ugly Collections)
గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని తమిళనాడులో 2400 స్క్రీన్స్, వరల్డ్ వైడ్ గా రూ.3000 థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరిగాయి. ఫలితంగా ప్రీ సేల్స్ లో 29.75 కోట్ల గ్రాస్ ను అందుకుంది. తమిళ నాడులో రూ.17.30 కోట్లు, ఇండియా వ్యాప్తంగా రూ.20.30 కోట్లు, ఓవర్సీస్ లో రూ.9.45 కోట్ల చొప్పున అడ్వాన్స్ బుకింగ్స్ ను అందుకుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

గుడ్ బ్యాడ్ అగ్లీ గత 2 రోజుల కలెక్షన్స్ (Good Bad Ugly 2 Days Collections)
ఓపెనింగ్ డేనే తమిళనాడులో రూ.30.90 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసింది. ఇక తమిళనాడులోని మెయిన్ సెంట్స్ లో 924 షోలకు 95 శాతం ఆక్యుపెన్సీని నమోదైందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. మొదటి రోజు ఇండియా నెట్ 29.25 కోట్ల నెట్ అందింది. ఇక ఇండియా గ్రాస్ 34.40 కోట్లు కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా ఇండియా + ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకొని డే1న రూ.51.40 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇక 2వ రోజు ఇండియా నెట్ రూ.15 కోట్ల వరకు వసూళ్లు చేసింది. ఇండియా గ్రాస్ 18 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో డే2 వరకు వరల్డ్ వైడ్ గా రూ.77 కోట్ల రూపాయాల గ్రాస్ ను వసూల్ చేసింది. ఇండియా నెట్ రూ44.25 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.52 కోట్లు వసూళ్లు చేసిందని సాక్ నిల్క్ గణంకాలు తెలిపాయి.

ఓవర్సీస్ డే2 కలెక్షన్లు (Good Bad Ugly Overseas Day 3 Collections)

ఓవర్సీస్ లోనూ అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. టాక్ అదిరిపోవడంతో డే1న ఓవర్సీస్ లో రూ.17 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు అందుకుంది. ఇక డే2న రూ.8 కోట్ల వరకు కలెక్షన్లు అందుకుందని రూ.25 కోట్ల మార్క్ ను చేరుకుందని సాక్క్ రిపోర్ట్. అయితే మొదటి రోజు జోరు చూపించిన ఈ చిత్రం కలెక్షన్లు రెండోవ రోజు మాత్రం డ్రాప్ అయ్యాయి. ప్రస్తుతం వీడకెండ్ కావడంతో జోరు చూపిస్తోంది. నెక్ట్స్ ఎలాంటి వసూళ్లు అందుకుంటుందో చూడాలి.

గుడ్ బ్యాడ్ అగ్లీ 3వ రోజు కలెక్షన్స్ (Good Bad Ugly Day 3 Collections)

గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి 3వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ దక్కింది. మూడోవ రోజు మొదటి శనివారం కావడంతో భారీగానే వసూళ్లు అందాయి. తమిళంలో 19.62 కోట్ల నెట్, తెలుగులో రూ.1.17 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. మొత్తం కలుపుకొని ఇండియాలో రూ.20.79 కోట్ల నెట్ అందుకుందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. దీంతో ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ డే3 కలెక్షన్లు అందుకొని రూ.30 కోట్లపైగా వసూళ్లు సాధించిందని ట్రేడ్ పండితులు తెలుపుతున్నారు. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం డే3 వరకు రూ.107 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు అందుకుందని ఎర్లీ ఎస్టిమేట్స్. ఇండియా నెట్ మాత్రం రూ.65.04 కోట్ల వరకు చేరుకుంది. ఇక ఏదేమైనా గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరుకోవడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X