Good Bad Ugly Day 4 Collections : అజిత్ ఊరమాస్ కలెక్షన్లు.. గుడ్ బ్యాడ్ అగ్లీకి 4వ రోజు ఎన్ని కోట్లో తెలుసా?
తమిళ అగ్ర హీరో అజిత్, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ జంటగా లేటెస్ట్ ఫిల్మ్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ విడుదలైంది. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించడం విశేషం. నవీన్ ఏర్నెనీ, వై రవి శంకర్ నిర్మాతలుగా వ్యహరించారు. జాకీ ష్రాఫ్, సునీల్, అర్జున్ దాస్, యోగి బాబు, ప్రియా ప్రకాష్ వారియర్ ముఖ్య పాత్రలు పోషించారు. సీనియర్ నటి సిమ్రాన్ కామియో అప్పీయరెన్స్ ఇచ్చింది. ఈ మూవీ రొమియోక్చర్స్ తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ని, కేవీఎన్ ప్రొడక్షన్స్ కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌ని, శ్రీగోకులం మూవీస్ కేరళ థియేట్రికల్ రైట్స్‌ని, ప్రత్యంగిరా సినిమాస్ యూఎస్ థియేట్రికల్ రైట్స్‌ని భారీ రేటుకు దక్కింకున్నారు. ఈ చిత్రం బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్, 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..
గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం బడ్జెట్ (Good Bad Ugly Budget) ఎంత?
'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రాన్ని టాప్ టెక్నాలజీతో నిర్మించారు. హై స్టాండర్డ్, ఎపిక్యూ ఫార్మాట్ లో రూపొందించారు. అజిత్, త్రిష కృష్ణన్ తోపాటు భారీ తాగాణం, టాప్ టెక్నీషియన్లు చిత్రం కోసం పనిచేయడంతో సినిమాకు బాగానే ఖర్చైంది. నిర్మాణ ఖర్చులు, రెమ్యునరేషన్లు, ప్రమోషన్స్ కలుపుకొని రూ.300 కోట్ల వరకు బడ్జెట్ వెచ్చించారు.

గుడ్ బ్యాడ్ అగ్లీ బ్రేక్ ఈవెన్ (Good Bad Ugly Break Even Target) టార్గెట్ ఎంత?
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా రూ.114 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సినిమా లాభాల్లోకి రావాలంటే.. రూ.115 కోట్ల షేర్, రూ.230 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు.
గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రీ సేల్ కలెక్షన్లు (Good Bad Ugly Collections)
ఈ చిత్రాన్ని తమిళనాడులో 2400 స్క్రీన్స్, వరల్డ్ వైడ్ గా రూ.3000 థియేటర్లలో గ్రాండ్ గా విడుదల విడుదల చేయడం విశేషం. ఫలితంగా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరిగాయి. ప్రీ సేల్స్ లో 29.75 కోట్ల గ్రాస్ ను అందుకుందీ చిత్రం. తమిళ నాడులో రూ.17.30 కోట్లు, ఇండియా వ్యాప్తంగా రూ.20.30 కోట్లు, ఓవర్సీస్ లో రూ.9.45 కోట్ల చొప్పున అడ్వాన్స్ బుకింగ్స్ ను అందుకుందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి.
గుడ్ బ్యాడ్ అగ్లీ గత 3 రోజుల కలెక్షన్స్ (Good Bad Ugly 3 Days Collections)
తమిళనాడులో ఓపెనింగ్ డేనే ఈ చిత్రం రూ.30.90 కోట్ల గ్రాస్ అందుకుంది. మొదటి రోజు ఇండియా నెట్ 29.25 కోట్లు అందింది. ఇండియా గ్రాస్ 34.40 కోట్లు కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా ఇండియా + ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకొని 1వ రూ.51.40 కోట్ల గ్రాస్ అందుకుందని సాక్ నిల్క్ గణాంకాలు చెబుతున్నాయి. 2వ రోజు ఇండియా నెట్ రూ.15 కోట్ల వరకు వసూళ్లు చేసింది. ఇండియా గ్రాస్ 18 కోట్లు కలెక్ట్ చేసింది. 3వ రోజు రూ.20.79 కోట్ల ఇండియా నెట్ అందుకుంది. రూ.23 కోట్ల వరకు ఇండియా గ్రాస్ వసూల్ చేసింది. దీంతో డే3 వరకు వరల్డ్ వైడ్ గా రూ.112.50 కోట్ల గ్రాస్ వసూల్ చేయడం విశేషం. కేవలం మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరింది.
ఓవర్సీస్ డే3 కలెక్షన్లు (Good Bad Ugly Overseas Day 3 Collections)
అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి ఓవర్సీస్ లోనూ మంచి రెస్పాన్స్ దక్కుతోంది. టాక్ అదిరిపోవడంతో 1వ రోజు ఓవర్సీస్ లో రూ.17 కోట్ల గ్రాస్, 2వ రోజు రూ.8 కోట్ల వరకు కలెక్షన్లు అందుకుంది. ఇక 3వ రోజు ఏకంగా రూ.12.50 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. ఇలా మొదటి వీకెండ్ పూర్తి కావడంతో ఈ సినిమా ఓవర్సీస్ లో మొత్తంగా రూ.37.15 కోట్ల గ్రాస్ అందుకుందని సాక్ నిల్క్ రిపోర్ట్ తెలుపుతోంది.
గుడ్ బ్యాడ్ అగ్లీ 4వ రోజు కలెక్షన్స్ (Good Bad Ugly Day 4 Collections)
ఇక 4వరోజు అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మరింత జోరుగా వసూళ్లు అందాయి. మొదటి ఆదివారం కావడంతో కలెక్షన్లు 20 శాతం వరకు పెరిగాయి. 4వ రోజు ఇండియా నెట్ రూ.23.84 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. తమిళంలో రూ.22.76 కోట్ల నెట్, తెలుగులో రూ.1.08 కోట్ల నెట్ వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకొని ఈ చిత్రం రూ.150 కోట్ల వరకు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లు సాధించిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఈ చిత్రం త్వరలోనే 200 కోట్ల క్లబ్ లో చేరేందుకు పరుగులు తీస్తోంది.


Click it and Unblock the Notifications











