Good Bad Ugly Day 5 Collections : అజిత్ తాండవం.. గుడ్ బ్యాడ్ అగ్లీ 5వ రోజు కలెక్షన్లు.. అదుర్స్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ చాలా కాలం తర్వాత కలిసి నటించిన చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 10న విడుదలైంది. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై టాలీవుడ్ అగ్ర నిర్మాతలు నవీన్ ఏర్నెనీ, వై రవి శంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించడం విశేషం. ఈ మూవీలో జాకీ ష్రాఫ్, సునీల్, అర్జున్ దాస్, యోగి బాబు, ప్రియా ప్రకాష్ వారియర్ ముఖ్య పాత్రలు పోషించారు. సీనియర్ నటి సిమ్రాన్ కామియో అప్పీయరెన్స్ ఇచ్చింది. ఈ చిత్రం బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్, 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..
గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం బడ్జెట్ (Good Bad Ugly Budget) ఎంత?
అజిత్ చిత్రానికి 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రాన్ని టాప్ టెక్నాలజీతో నిర్మించారు. హై స్టాండర్డ్, ఎపిక్యూ ఫార్మాట్ లో రూపొందించారు. అజిత్, త్రిష కృష్ణన్ తోపాటు భారీ తాగాణం, టాప్ టెక్నీషియన్లు చిత్రం కోసం పనిచేయడంతో సినిమాకు బాగానే ఖర్చైంది. నిర్మాణ ఖర్చులు, రెమ్యునరేషన్లు, ప్రమోషన్స్ కలుపుకొని రూ.300 కోట్ల వరకు బడ్జెట్ వెచ్చించారు.

గుడ్ బ్యాడ్ అగ్లీ బ్రేక్ ఈవెన్ (Good Bad Ugly Break Even Target) టార్గెట్ ఎంత?
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. ఈ చిత్రానికి సంబంధించిన రొమియో పిక్చర్స్ తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ని, కేవీఎన్ ప్రొడక్షన్స్ కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌ని, శ్రీగోకులం మూవీస్ కేరళ థియేట్రికల్ రైట్స్‌ని, ప్రత్యంగిరా సినిమాస్ యూఎస్ థియేట్రికల్ రైట్స్‌ని భారీ రేటుకు దక్కింకున్నారు. ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా రూ.114 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సినిమా లాభాల్లోకి రావాలంటే.. రూ.115 కోట్ల షేర్, రూ.230 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు.
గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రీ సేల్ కలెక్షన్లు (Good Bad Ugly Collections)
తమిళనాడులో 2400 స్క్రీన్స్, వరల్డ్ వైడ్ గా రూ.3000 థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైందీ చిత్రం. దీంతో బుకింగ్స్ జోరుగా జరిగాయి. ప్రీ సేల్స్ లో 29.75 కోట్ల గ్రాస్ ను అందుకుంది. తమిళనాడులో రూ.17.30 కోట్లు, ఇండియా వ్యాప్తంగా రూ.20.30 కోట్లు, ఓవర్సీస్ లో రూ.9.45 కోట్ల చొప్పున అడ్వాన్స్ బుకింగ్స్ ను అందుకుందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి.
గుడ్ బ్యాడ్ అగ్లీ గత 4 రోజుల కలెక్షన్స్ (Good Bad Ugly 4 Days Collections)
మొదటి రోజు ఇండియా నెట్ 29.25 కోట్లు వసూళ్లు చేసింది. తమిళనాడులో డే1న రూ.30 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసి ఆశ్చర్యపరించింది. ఇండియా గ్రాస్ 34.40 కోట్లు కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా ఇండియా + ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకొని 1వ రూ.51.40 కోట్ల గ్రాస్ అందుకుందని సాక్ నిల్క్ గణాంకాలు చెబుతున్నాయి. ఇక 2వ రోజు ఇండియా నెట్ రూ.15 కోట్ల వరకు వసూళ్లు చేసింది. ఇండియా గ్రాస్ 18 కోట్లు కలెక్ట్ చేసింది. 3వ రోజు రూ.20.79 కోట్ల ఇండియా నెట్ అందుకుంది. రూ.23 కోట్ల వరకు ఇండియా గ్రాస్ వసూల్ చేసింది. 4వ రోజు ఇండియా నెట్ రూ.22.3 కోట్లు వసూల్ చేసింది.
ఓవర్సీస్ డే3 కలెక్షన్లు (Good Bad Ugly Overseas Day 3 Collections)
అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి ఓవర్సీస్ లోనూ మంచి రెస్పాన్స్ దక్కుతోంది. టాక్ అదిరిపోవడంతో 1వ రోజు ఓవర్సీస్ లో రూ.17 కోట్ల గ్రాస్, 2వ రోజు రూ.8 కోట్ల వరకు కలెక్షన్లు అందుకుంది. ఇక 3వ రోజు ఏకంగా రూ.12.50 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. 4వ రోజు రూ.11.25 కోట్ల వరకు ఓర్సీస్ కలెక్షన్లు సాధించింది. 4రోజుల్లోనే ఓవర్సీస్ లో రూ.48.4 కోట్లు వసూల్ చేసింది.
గుడ్ బ్యాడ్ అగ్లీ 5వ రోజు కలెక్షన్స్ (Good Bad Ugly Day 5 Collections)
ఇక 5వరోజు సోమవారం వర్కింగ్ డే అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జోరు ఏమాత్రం ఆగలేదు. తమిళంలో రూ.13.86 కోట్లు వసూళ్లు చేసింది. తెలుగులో రూ.70 లక్షల నెట్ అందుకుంది. మొత్తంగా 5వ రోజున ఇండియా నెట్ రూ.14 కోట్ల వరకు వసూలైంది. సాక్ నిల్క్ రిపోర్ట్ తెలుపుతుంది. ఇక 18 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసి ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక డే5 వరకు ఇండియా నెట్ రూ.100.86 కోట్లకు చేరుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలుపుకొని రూ.170 కోట్ల వరకు కలెక్షన్లు సాధించినట్టు ట్రేడ్ పండింతులు వివరిస్తున్నారు. ఇలా వర్కింగ్ డేస్ లోనూ ఈ చిత్రానికి 10 కోట్లకు తగ్గకుండా వసూళ్లు వస్తుండటం విశేషంగా మారింది.


Click it and Unblock the Notifications











