Good Bad Ugly Day 6 Collections : రప్ఫాడిస్తున్న అజిత్.. గుడ్ బ్యాడ్ అగ్లీ 6 రోజుల కలెక్షన్లు.. ఎన్ని కోట్లు?
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ జంటగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 10న విడుదలైంది. ఈ చిత్రానికి అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై టాలీవుడ్ అగ్ర నిర్మాతలు నవీన్ ఏర్నెనీ, వై రవి శంకర్ నిర్మించారు. సిమ్రాన్ కామియో అప్పీయరెన్స్ ఇవ్వగా.. జాకీ ష్రాఫ్, సునీల్, అర్జున్ దాస్, యోగి బాబు, ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్, 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..
గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం బడ్జెట్ (Good Bad Ugly Budget) ఎంత?
తమిళ స్టార్ అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రాన్ని టాప్ టెక్నాలజీతో నిర్మించారు. హై స్టాండర్డ్, ఎపిక్యూ ఫార్మాట్ లో రూపొందించారు. అజిత్, త్రిష కృష్ణన్ తోపాటు భారీ తాగాణం, టాప్ టెక్నీషియన్లు చిత్రం కోసం పనిచేయడంతో సినిమాకు బాగానే ఖర్చైంది. నిర్మాణ ఖర్చులు, రెమ్యునరేషన్లు, ప్రమోషన్స్ కలుపుకొని రూ.300 కోట్ల వరకు బడ్జెట్ వెచ్చించారు.

గుడ్ బ్యాడ్ అగ్లీ బ్రేక్ ఈవెన్ (Good Bad Ugly Break Even Target) టార్గెట్ ఎంత?
'గుడ్ బ్యాడ్ అగ్లీ' ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. రొమియో పిక్చర్స్ తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ని, కేవీఎన్ ప్రొడక్షన్స్ కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌ని, శ్రీగోకులం మూవీస్ కేరళ థియేట్రికల్ రైట్స్‌ని, ప్రత్యంగిరా సినిమాస్ యూఎస్ థియేట్రికల్ రైట్స్‌ని భారీ రేటుకు దక్కింకున్నారు. మరోవైపు ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా రూ.114 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సినిమా లాభాల్లోకి రావాలంటే.. రూ.115 కోట్ల షేర్, రూ.230 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు.
గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రీ సేల్ కలెక్షన్లు (Good Bad Ugly Collections)
తమిళనాడులో 2400 స్క్రీన్స్, వరల్డ్ వైడ్ గా రూ.3000 థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైందీ చిత్రం. దీంతో బుకింగ్స్ జోరుగా జరిగాయి. ప్రీ సేల్స్ లో 29.75 కోట్ల గ్రాస్ ను అందుకుంది. తమిళనాడులో రూ.17.30 కోట్లు, ఇండియా వ్యాప్తంగా రూ.20.30 కోట్లు, ఓవర్సీస్ లో రూ.9.45 కోట్ల చొప్పున అడ్వాన్స్ బుకింగ్స్ ను అందుకుందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి.
గుడ్ బ్యాడ్ అగ్లీ గత 5 రోజుల కలెక్షన్స్ (Good Bad Ugly 5 Days Collections)
బాక్సాఫీస్ వద్ద అజిత్ కుమార్ రప్ఫాడిస్తున్నాడు. భారీ వసూళ్లను అందుకుంటూ అదరగొడుతున్నాడు. మొదటి రోజు ఇండియా నెట్ 29.25 కోట్లు వసూళ్లు చేసింది. ఇండియా + ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకొని వరల్డ్ వైడ్ గా 1వ రోజు రూ.51.40 కోట్ల గ్రాస్ అందుకుందని సాక్ నిల్క్ గణాంకాలు చెప్పాయి. 2వ రోజు ఇండియా నెట్ రూ.15 కోట్ల వరకు వసూళ్లు చేసింది. ఇండియా గ్రాస్ 18 కోట్లు కలెక్ట్ చేసింది. 3వ రోజు రూ.20.79 కోట్ల ఇండియా నెట్ అందుకుంది. రూ.23 కోట్ల వరకు ఇండియా గ్రాస్ వసూల్ చేసింది. 4వ రోజు ఇండియా నెట్ రూ.22.3 కోట్లు వసూల్ చేసింది. 5వ రోజు ఇండియా నెట్ రూ.15 కోట్లు వసూళ్లు చేసింది. వరల్డ్ వైడ్ గా గ్రాస్ రూ.21 కోట్ల వరకు వసూలైంది.
ఓవర్సీస్ డే6 కలెక్షన్లు (Good Bad Ugly Overseas Day 6 Collections)
అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి ఓవర్సీస్ లోనూ మంచి రెస్పాన్స్ దక్కుతోంది. టాక్ అదిరిపోవడంతో 1వ రోజు ఓవర్సీస్ లో రూ.17 కోట్ల గ్రాస్, 2వ రోజు రూ.8 కోట్లు, 3వ రోజు ఏకంగా రూ.12.50 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. 4వ రోజు రూ.11.25 కోట్ల వరకు ఓర్సీస్ కలెక్షన్లు సాధించింది. 5రోజుతో ఓవర్సీస్ లో రూ.52.15 కోట్లు వసూల్ చేసింది. 6వ రోజు రూ.3 కోట్లు వరకు వసూల్ చేసి ఉంటుందని కోట్లు వసూల్ చేసింది.
గుడ్ బ్యాడ్ అగ్లీ 6వ రోజు కలెక్షన్స్ (Good Bad Ugly Day 6 Collections)
6వరోజు మంగళవారం వర్కింగ్ డే అయినప్పటికీ బాక్సాఫీస్ కలెక్షన్ల జోరుగానే అందాయి. తమిళంలో రూ.6.25 కోట్ల నెట్, తెలుగులో రూ.0.38 కోట్లు వసూళ్లు అందుకుంది. మొత్తంగా 6వ రోజు ఇండియా నెట్ రూ.6.63 కోట్లు అందుకుంది. ఆరు రోజుల్లో ఇండియా నెట్ టోటల్ గా రూ.107.93 కోట్లకు చేరుకుందని సాక్ నిల్క్ రిపోర్ట్ తెలుపుతోంది. ఇక ఇండియా గ్రాస్ రూ.130 కోట్ల వరకు చేరుకుందని, ఓవర్సీస్ + ఇండియా గ్రాస్ వసూళ్లు కలుపుకొని డే6 వరకు రూ.180 కోట్ల వరకు వసూళ్లు సాధించి ఉంటుందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











