Good Bad Ugly Day 7 Collections : 200 కోట్లు.. గుడ్ బ్యాడ్ అగ్లీ 7 రోజుల కలెక్షన్లు.. ఉతికారేస్తున్న తాలా
తమిళ అగ్ర హీరో అజిత్ కుమార్, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ నటించిన తాజా చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అదిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై టాలీవుడ్ అగ్ర నిర్మాతలు నవీన్ ఏర్నెనీ, వై రవి శంకర్ నిర్మించారు. సిమ్రాన్ కామియో అప్పీయరెన్స్ ఇచ్చింది. జాకీ ష్రాఫ్, సునీల్, అర్జున్ దాస్, యోగి బాబు, ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రల్లో అలరించారు. ఇక ఈ చిత్రం బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్, 7 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..
గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం బడ్జెట్ (Good Bad Ugly Budget) ఎంత?
హై స్టాండర్డ్, ఎపిక్యూ ఫార్మాట్ లో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రాన్ని టాప్ టెక్నాలజీతో నిర్మించారు. అజిత్, త్రిష కృష్ణన్ తోపాటు భారీ తాగాణం, టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రం కోసం పనిచేయడం విశేషం. దీంతో సినిమాకు బాగానే ఖర్చైంది. నిర్మాణ ఖర్చులు, రెమ్యునరేషన్లు, ప్రమోషన్స్ కలుపుకొని రూ.300 కోట్ల వరకు బడ్జెట్ వెచ్చించారు.

గుడ్ బ్యాడ్ అగ్లీ బ్రేక్ ఈవెన్ (Good Bad Ugly Break Even Target) టార్గెట్ ఎంత?
'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రానికి భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. రొమియో పిక్చర్స్ తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ని, కేవీఎన్ ప్రొడక్షన్స్ కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌ని, శ్రీగోకులం మూవీస్ కేరళ థియేట్రికల్ రైట్స్‌ని, ప్రత్యంగిరా సినిమాస్ యూఎస్ థియేట్రికల్ రైట్స్‌ని భారీ రేటుకు దక్కించుకున్నారు. ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ద్వారా వరల్డ్ వైడ్ రూ.114 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సినిమా లాభాల్లోకి రావాలంటే.. రూ.115 కోట్ల షేర్, రూ.230 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు.
గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రీ సేల్ కలెక్షన్లు (Good Bad Ugly Collections)
తమిళనాడులో 2400 స్క్రీన్స్, వరల్డ్ వైడ్ గా రూ.3000 థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. దీంతో బుకింగ్స్ జోరుగా జరిగాయి. ప్రీ సేల్స్ లో రూ.29.75 కోట్ల గ్రాస్ ను అందుకుంది. తమిళనాడులో రూ.17.30 కోట్లు, ఇండియా వ్యాప్తంగా రూ.20.30 కోట్లు, ఓవర్సీస్ లో రూ.9.45 కోట్ల చొప్పున అడ్వాన్స్ బుకింగ్స్ ను అందుకుందని ట్రేడ్ పండింతులు చెబుతున్నారు.
గుడ్ బ్యాడ్ అగ్లీ గత 6 రోజుల కలెక్షన్స్ (Good Bad Ugly 6 Days Collections)
డే1న ఇండియా నెట్ 29.25 కోట్లు వసూళ్లైంది. ఇండియా + ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకొని వరల్డ్ వైడ్ గా మొదటి రోజు రూ.51.40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని సాక్ నిల్క్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2వ రోజు ఇండియా నెట్ రూ.15 కోట్ల, ఇండియా గ్రాస్ 18 కోట్లు, 3వ రోజు రూ.20.79 కోట్ల ఇండియా నెట్, ఇండియా గ్రాస్ రూ.23 కోట్ల వసూల్ చేసింది. 4వ రోజు ఇండియా నెట్ రూ.22.3 కోట్లు, 5వ రోజు ఇండియా నెట్ రూ.15 కోట్లు వసూళ్లు చేసింది. ఇండియా గ్రాస్ రూ.21 కోట్లు వసూలైంది. ఇక 6వ రోజు రూ.7 కోట్ల ఇండియా నెట్ వసూల్ చేసింది. గ్రాస్ రూ. 8.50 కోట్ల వరకు వసూల్ చేసింది. ఆరవ రోజు వరకు ఇండియా నెట్ రూ.113.43 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.127.5 కోట్లు అందుకుంది. వరల్డ్ వైడ్ గా రూ.180 కోట్ల గ్రాస్ అందుకుంది.
ఓవర్సీస్ డే7 కలెక్షన్లు (Good Bad Ugly Overseas Day 7 Collections)
అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి ఓవర్సీస్ లోనూ మంచి రెస్పాన్స్ దక్కింది. మొదటి రోజు ఓవర్సీస్ లో రూ.17 కోట్ల గ్రాస్, 2వ రోజు రూ.8 కోట్లు, 3వ రోజు ఏకంగా రూ.12.50 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. 4వ రోజు రూ.11.25 కోట్ల వరకు ఓర్సీస్ కలెక్షన్లు సాధించింది. 5, 6 రోజు కలిసి రూ.4.5 కోట్లు కలెక్షన్లు అందుకుంది. ఓవర్సీస్ లో మొత్తంగా 7రోజుల్లో రూ.6.4 మిలియన్ల డాలర్లను వసూళ్లు చేసింది.
గుడ్ బ్యాడ్ అగ్లీ 7వ రోజు కలెక్షన్స్ (Good Bad Ugly Day 7 Collections)
7వరోజు బుధవారం వర్కింగ్ డే అయినప్పటికీ బాక్సాఫీస్ కలెక్షన్ల జోరుగానే అందాయి. తమిళంలో రూ.4.81కోట్ల నెట్, తెలుగులో రూ.0.32 కోట్లు వసూళ్లు అందుకుంది. మొత్తంగా 7వ రోజు ఇండియా నెట్ రూ.5.50 కోట్లు అందుకుందని సాక్ నిల్క్ వెల్లడించింది. ఏడు రోజుల్లో ఇండియా నెట్ టోటల్ గా రూ.194 కోట్లకు చేరిందని, ఓవర్సీస్ వసూళ్లు కలుపుకొని రూ.200 కోట్ కోట్ల మార్క్ చేరిందని ట్రేడ్ పండింతులు తెలుపుతున్నారు. ఇక తమిళంలో 2025లో హయ్యేస్ట్ గ్రాస్ వసూల్ చేసిన చిత్రంగా గుడ్ బ్యాడ్ అగ్లీ రికార్డు క్రియేట్ చేసింది.


Click it and Unblock the Notifications











