టాలీవుడ్ కు గొప్ప కిక్
రవితేజ "కిక్" నిజంగానే క్లిక్ అయింది. ఈ చిత్రం అన్ని సెంటర్లలోనూ మంచి కలెక్షన్లు రాబడుతోంది. రవితేజ, ఇలియానా జంటగా నటించిన ఈ సినిమా ఫస్టాఫ్ అద్భుతంగా ఉండడంతో సెకండాఫ్ కొద్దగా బలహీనపడీనా కవర్ అయిపోయింది. వేసవిలో ప్రేక్షకులకు ఆరోగ్యకరమైన కిక్ ను ఈ సినిమా ద్వారా దర్శకుడు సురేందర్ రెడ్డి ఇచ్చారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 'అరుంధతి' తర్వాత ఇదే హిట్ సినిమా. అంటే దాదాపు ఆరు నెలల్లో తెలుగు సినిమా రంగంలో రెండే రెండు హిట్లు అన్నమాట.
ఈవారం విడుదలైన "ఫ్లాష్ న్యూస్" "ఈ వయసులో", "దోషి" చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొందలేక బొక్కబోర్లా పడ్డాయి. గత వారం చిత్రాలు ప్రభాస్ "భిల్లా", జగపతిబాబు 'అధినేత' చిత్రాలు హిట్ కోవలోకి రాకపోయినా కలెక్షన్ల పరంగా బాగున్నాయి.
kick ravi teja ileana surendra reddy shyam arundhati doshi jagapati babu రవితేజ కిక్ ఇలియానా సురేందర్ రెడ్డి


Click it and Unblock the Notifications