twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Good Newwz Collections: అక్షయ్, కరీనా బాక్సాఫీస్ మ్యాజిక్.. 200 కోట్ల వైపు పరుగు

    |

    బాలీవుడ్ క్రేజీ స్టార్స్ అక్షయ్ కుమార్, కరీనా కపూర్ జంటగా నటించిన గుడ్ న్యూస్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రం దేశవ్యాప్తంగానే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. కరీనా కపూర్, అక్షయ్ కుమార్, కియారా అద్వానీ, దిల్జిత్ సింగ్ కలిసి నటించిన చిత్రం డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలివారాంతం తర్వాత కూడా నిలకడగా వసూళ్లను సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. గత నాలుగు రోజుల్లో గుడ్ న్యూస్ చిత్రం ఎంత మేరకు వసూళ్లను సాధించిందంటే..

    5వ రోజున 150 కోట్ల క్లబ్‌లోకి

    5వ రోజున 150 కోట్ల క్లబ్‌లోకి

    గుడ్ న్యూస్ చిత్రం దేశవ్యాప్తంగా భారీగా రిలీజైంది. ఈ చిత్రం ఐదు రోజుల్లో రూ.100 కోట్లకుపైగా నికర వసూళ్లను రూ.111.62 కోట్లపైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్‌లో రూ.29.75 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం రూ.141.37 కోట్లు వసూలు చేసి.. 150 కోట్ల క్లబ్‌కు చేరువైంది.

    నాలుగు రోజులగా

    నాలుగు రోజులగా

    గత 4 రోజులుగా గుడ్ న్యూస్ చిత్రం హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తున్నది. శుక్రవారం రూ.17.56 కోట్లు, శనివారం రూ.21.78 కోట్లు, ఆదివారం రూ.25.65 కోట్లు, సోమవారం రూ.13.41 కోట్లు, మంగళవారం రూ.16.20 కోట్లు వసూలు చేయడంతో నాలుగు రోజుల్లో రూ.94.50 కోట్లు రాబట్టింది. జనవరి 1వ తేదీన రూ.100 కోట్ల మార్కును దాటడం ఖాయంగా కనిపిస్తున్నది అని తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

     జనవరి 1న మ్యాజిక్

    జనవరి 1న మ్యాజిక్

    గతేడాది జనవరి 1వ రోజున సింబా ఓ ఘనతను సొంతం చేసుకొన్నది. 2018 డిసెంబర్‌లో చివరి చిత్రంగా రిలీజైన సింబా జనవరి 1వ తేదీన రూ.100 కోట్ల మార్కును దాటింది. ఇక 2019లో చివరి చిత్రంగా విడుదలైన గుడ్ న్యూస్ చిత్రం జనవరి 1వ తేదీన రూ.100 కోట్లు బాలీవుడ్‌కు సంపాదించి పెట్టిన చిత్రంగా ఘనతను సాధించనున్నది.

    200 కోట్ల క్లబ్‌లోకి గుడ్ న్యూస్

    200 కోట్ల క్లబ్‌లోకి గుడ్ న్యూస్

    గుడ్ న్యూస్ చిత్రం నిలకడగా కలెక్షన్లను రాబట్టతుండటంతో కొన్ని రోజుల్లోనే రూ.200 కోట్ల మైలురాయిని దాటే అవకాశం ఉందనే మాట ట్రేడ్ వర్గాలు, సినీ విమర్శకుల నుంచి వ్యక్తమవుతున్నది. ఈ సినిమా 2019లో అక్షయ్ కుమార్ బాక్సాఫీస్ స్టామినాను మరోసారి గుర్తు చేసింది. ఈ చిత్రం సల్మాన్ ఖాన్ నటించిన దంబంగ్ 3 చిత్రానికి ధీటుగా వసూళ్లను రాబడుతున్నది.

    English summary
    Good Newwz movie 4 days Box Office Collections: Akshay Kumar, Kareen Kapoor Khan has done Magic at box office. Taran Adarsh tweets that #GoodNewwz gallops into #NewYear triumphantly... Packs a superb number on Day 5 [New Year Eve], despite lower ticket rates on weekdays... Will cross ₹ 💯 cr today [Wed; 1 Jan]... 17.56 cr, Sat 21.78 cr, Sun 25.65 cr, Mon 13.41 cr, Tue 16.20 cr. Total: ₹ 94.60 cr. #India biz.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X