twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘గూఢచారి’ మూవీకి లాభాలే లాభాలు; 10 రోజుల్లో ఎంతంటే?

    By Bojja Kumar
    |

    అడివి శేష్ నటించిన స్పై థ్రిల్లర్ 'గూఢచారి' మూవీ బాక్సాఫీసు వద్ద అద్భుతమైన ఫలితాలు సాధిస్తోంది. రెండో వారంలోనూ సూపర్ డూపర్ కలెక్షన్స్ సాధిస్తూ తొలి 10 రోజుల్లోనే అద్భుతమైన వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్ చిత్రాల లిస్టులో చేరిపోయింది. సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే తాము పెట్టిన పెట్టుబడి రాబట్టుకోవడంతో పాటు లాభాలు పొందుతూ హ్యాపీ మూడ్లోకి వెళ్లిపోయారు. గతంలో 'క్షణం' సినిమాతో హిట్ కొట్టిన అడివి శేష్ కాస్త గ్యాప్ తీసుకున్నా... మంచి మూవీని సెలక్ట్ చేసుకుని తన సత్తా చాటాడు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, జగపతి బాబు, శోభిత ధూళిపాళ, సుప్రియ, వెన్నెల కిషోర్ నటన మరింత ప్లస్సయింది.

     తొలి రోజు నుండే సూపర్ హిట్ టాక్‌తో

    తొలి రోజు నుండే సూపర్ హిట్ టాక్‌తో

    శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ‘గూఢచారి' ఆగస్టు 3న విడుదలైన తొలి షో నుండే సూపర్ హిట్ మౌత్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రానికి తొలి వారంలోనే రూ. 15.15 కోట్ల గ్రాస్ వసూలైంది. ఇందులో రూ. 6.8 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చినట్లు సమాచారం.

     ఆ రెండు సినిమాలు వచ్చినా..

    ఆ రెండు సినిమాలు వచ్చినా..

    తర్వాతి వారం శ్రీనివాస కళ్యాణం, విశ్వరూపం 2 చిత్రాలు విడుదలవ్వగా ‘గూఢచారి' వసూళ్లపై ప్రభావం పడుతుందని అంతా భావించారు. అయితే ఆ రెండు చిత్రాలకు నెగెటివ్ టాక్ రావడంతో ‘గూఢచారి' మూవీపై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి.

    సెకండ్ వీకెండ్ అదుర్స్

    సెకండ్ వీకెండ్ అదుర్స్

    సెకండ్ వీకెండ్ గూఢచారి మూవీ రూ. 3.85 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో 10 రోజుల గ్రాస్ టోటల్ రూ. 19 కోట్లకు చేరుకుంది. దీంతో ఓవరాల్ డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ. 8.5 కోట్లకు రీచ్ అయింది.

    పది రోజుల్లోనే లాభాల్లోకి...

    పది రోజుల్లోనే లాభాల్లోకి...

    గూఢచారి థియేట్రికల్ రైట్స్ రూ. 6 కోట్లకు అమ్ముడయ్యాయి. పది రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ. 8.50 కోట్లకు చేరుకోవడంతో.... వారు తమ పెట్టుబడి రాబట్టుకోవడంతో పాటు రూ. 2.50 కోట్ల లాభాలు తమ ఖాతాలో వేసుకున్నట్లయింది. సినిమా ఫుల్ రన్‌లో మరిన్ని లాభాలు ఖాయం అని స్పష్టమవుతోంది.

    బడ్జెట్ ఎంత?

    బడ్జెట్ ఎంత?

    కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దర్శకుడు శశి కిరణ్ తిక్క అద్భుతమైన స్క్రీన్ ప్లేతో పాటు తక్కువ బడ్జెట్‌లో సినిమా పూర్తయ్యేలా తగిన జాగ్రత్తలు తీసుకోవడం, నిర్మాతలు అభిషేక్ నామ, అభిషేక్ అగర్వాల్, టిజి విశ్వప్రసాద్ దర్శకుడికి సపోర్ట్ చేస్తూ చక్కని టీమ్ వర్క్ చేయడం వల్లనే ఈ విజయం సాధ్యమైందని అంటున్నారు.

    English summary
    Goodachari has collected approximately Rs 3.85 crore gross at worldwide box office in the second weekend, taking its 10-day total collection to Rs 19 crore gross. The distributors have shelled out Rs 6 crore on its theatrical rights and Goodachari has earned them Rs 8.50 crore for them.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X