‘గూఢచారి’ బాక్సాఫీసు కలెక్షన్స్ అదుర్స్
అడవి శేష్, శోభిత ధూలిపాళ హీరో హీరోయిన్లుగా ప్రకాష్ రాజ్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'గూఢచారి' బాక్సాఫీసు వద్ద అదరగొడుతోంది. ముఖ్యంగా యూఎస్ఏలో ఈచిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఆగస్టు 3న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. తొలి 2 రోజుల్లో ప్రీమియర్ షోలతో కలిసి రూ. 2 కోట్లకుపైగా వసూలు చేసింది. ఆదివారం వసూళ్లు కూడా కలిస్తే యూఎస్ఏ వీకెండ్ కలెక్షన్ రూ. 3.5 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు.

'గూఢచారి' కలెక్షన్లపై ప్రముఖ సినీ వ్యాపార విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ స్పందిస్తూ... సాలిడ్ కంటెంటుతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద అదరగొడుతోంది. ఈ చిత్రం రెండు రోజుల్లో అమెరికా బాక్సాఫీసు వద్ద రూ.2.14 కోట్లు రాబట్టినట్లు ట్వీట్ చేశారు. శుక్రవారంతో పోలిస్తే శనివారం వసూళ్లు 51 శాతం పెరిగాయి. సినిమాకు హిట్ టాక్ రావడమే ఇందుకు కారణమని వెల్లడించారు.
ఈ సినిమాపై ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా ట్వీట్ చేస్తూ..."స్పై ఫిల్మ్ గూఢచారి చిత్రం చూస్తున్నంత సేపు ప్రతి నిమిషం థ్రిల్ ఫీలయ్యాను. సినిమాను చాలా ఎంజాయ్ చేశాను. అడవి శేష్, శోభిత ధూళిపాళ, ప్రకాశ్ రాజ్, శశి కిరణ్ గ్రేట్ వర్క్' అంటూ ట్వీట్ చేశారు.
క్షణం' వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత అడివి శేష్ హీరోగా నటించిన చిత్రం 'గుడాచారి'. శోభిత ధూళిపాళ్ల హీరోయిన్ గా అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీం మర్చెంట్స్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అభిషేక్ నామ, టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా గూడాచారి చిత్రాన్ని నిర్మించారు.


Click it and Unblock the Notifications











