గూగుల్ ప్రకటించిన లిస్ట్ లో 'ఆగడు' టీజర్
హైదరాబాద్ : మహేష్ బాబు...రికార్డులకు కేరాఫ్ ఎడ్రస్ గా మారిపోతున్నారు. తాజాగా ఆయన చిత్రం 'ఆగడు' టీజర్ విడుదలైంది. ఈ టీజర్ టాప్ గూగుల్ సెర్చింగ్ లిస్ట్ లో స్దానం సంపాదించుకుంది. ఈ మేరకు గూగుల్ సంస్ధ...ఈ సంవత్సరం ఎక్కువ సెర్చ్ చేసిన లిస్ట్ ని ఎనౌన్స్ చేసారు. అందులో ఐదవ స్దానంలో ఈ టీజర్ ఉంది. ఆ వివరాలు క్రింద చూడవచ్చు...
1. హ్యాపీ న్యూ ఇయర్ (షారూఖ్ ఖాన్)
2. కిక్ (సల్మాన్ ఖాన్)
3. కత్తి (విజయ్)
4. బ్యాంగ్ బ్యాంగ్ (హృతిక్ రోషన్)
5. ఆగడు (మహేష్ బాబు).

మహేష్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఆగడు'. కృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ కు మహేష్ బాబు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషాన్ని ఆయన ఇలా పంచుకున్నారు.
14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ స్వరాలందిస్తున్నారు.
పంచ్ డైలాగు లేకపోతే.. టీజర్, ట్రైలర్ పూర్తవడం లేదు. ఆఖరి పంచ్ హీరోదైతే ఆ కిక్కే వేరుగా ఉంటుందని సినీ జనాలకు అర్థమయ్యింది. అందుకే పంచ్‌లు పేలుతున్నాయి. అయితే మహేష్‌బాబు మాత్రం పంచ్‌లపైనే పంచ్ వేసేశాడు. 'ఆగడు' టీజర్‌లో. మహేష్‌బాబు, శ్రీనువైట్ల కలయికలో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'ఆగడు'. తమన్నా కథానాయిక. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.
కృష్ణ పుట్టినరోజు సందర్భంగా శనివారం 'ఆగడు' టీజర్‌ని విడుదల చేశారు. ఇందులో మహేష్ పలికిన సంభాషణలు అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. ''సినిమాల ప్రభావం జనాలమీద ఎంతుందో తెలియదుగానీ, పంచ్ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది..'' అంటూ పంచ్‌లపై ఓ పంచ్ వేశారు. ''ప్రతివోడూ పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుకలంటూ ఎదవ కంపేరిజన్‌లు, ఒళ్లు వులపరం వచ్చేస్తోంది..'' అంటూ ఇంకోటి. మొత్తానికి టీజర్ మొత్తం హుషారుగా సాగిపోయింది.
ఇటీవల లడఖ్‌లో చిత్రీకరణ పూర్తిచేశారు. ఈనెల 5 నుంచి 21 వరకూ ముంబైలో మరో షెడ్యూల్ జరగనుంది. సెప్టెంబరులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ''మహేష్ కెరీర్‌లో నెంబర్ వన్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. మహేష్ పలికే ప్రతి సంభాషణ ఆకట్టుకొంటుంది. ఆయన కామెడీ టైమింగ్ అందరికీ నచ్చుతుంద''ని చిత్రబృందం చెబుతోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
'దూకుడు' తర్వాత మహేష్, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకొనేలా 'ఆగడు'ని రూపొందిస్తున్నట్టు సినిమావర్గాలు చెబుతున్నాయి. మహేష్ శైలి వినోదం, యాక్షన్ అంశాల మేళవింపుతో సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల,నిర్మాతలు పూర్తి నమ్మకంగా ఉన్నారు. ఈచిత్రంలో సోనూసూద్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, నెపోలియన్, సాయికుమార్ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్, కళ: ఎ.ఎస్.ప్రకాశ్, కూర్పు: ఎం.ఆర్.వర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పరుచూరి కోటి.


Click it and Unblock the Notifications











