పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్యూ రికార్డ్

By Bojja Kumar

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే క్రేజ్ ఏ రేంజిలో ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ నటించిన చివరి 'అత్తారింటికి దారేది' తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించి రికార్డు నెలకొల్పింది. దీంతో పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'గోపాలా గోపాలా' సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది.

తాజాగా నెల్లూరు ఏరియాకుగాను 'గోపాలా గోపాలా' చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకోవడానికి హరి పిక్చర్స్ వారు రూ. 2.20 కోట్లు చెల్లించడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. నెల్లూరు ఏరియా మెగా హీరోల సినిమాలకు కంచుకోట లాంటిది. గతంలో రామ్ చరణ్ సినిమాలైన మగధీర, రచ్చ, నాయక్, ఎవడు చిత్రాలు ఇక్కడ 2 కోట్లకు పైగా వసూలు చేసాయి. పవన్ గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, అల్లు అర్జున్ 'రేసు గుర్రం' చిత్రాలు కూడా రూ. 2 కోట్ల క్లబ్ లో చోటు దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో 'గోపాలా గోపాలా' సినిమాకు 2.20 కోట్లు ఆఫర్ చేసి దక్కించుకున్నారు హరి పిక్చర్స్ వారు.

‘Gopala Gopala’ Nellore Theatrical rights Rs 2.20 cr

పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి మినిమం గ్యారంటీ అనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు నెల్లూరు ఏరియాలో ఏ సినిమాకు కూడా రూ. 2.20 కోట్ల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రాలేదు. తెలుగు సినిమా చరిత్రలో నెల్లూరు టెర్రిటరీలో ఇదే హయ్యెస్ట్ అమౌంట్ అని అంటున్నారు. మరి వసూళ్ల పరంగా ఈచిత్రం ఎన్ని కార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.

హిందీలో విజయవంతమైన 'ఓ మై గాడ్‌' చిత్రాన్ని పవన్‌ కల్యాణ్‌, వెంకటేష్ మల్టీ స్టారర్‌గా తెలుగులో 'గోపాలా గోపాలా'గా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మోడరన్‌ కృష్ణుడు పాత్రలో కనిపిస్తాడు. వెంకటేష్ వ్యాపారి పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. . కిషోర్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సురేష్ బాబు, శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మధు శాలిని, దీక్ష పంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X