సినిమాలన్నీ గోదాట్లో(ట్రేడ్ టాక్)
ఎంతో హైప్, క్రేజ్ తో ఈ వారం రిలీజైన 'గోపి..గోపిక..గోదావరి' చిత్రం ఓపినింగ్స్ బాగా తెచ్చుకున్నా ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ చిత్రం కాక మరో నాలుగు చిత్రాలు ఈ వారం భాక్సాఫీస్ ని పలకరించి నిరాశపరిచాయి. వాటిలో డైరక్ట్ చిత్రాలు శ్రీహరి హీరోగా చేసిన 'సామ్రాజ్యం',కొత్తవారితో చేసిన 'అడుగు', డబ్బింగ్ చిత్రాల్లో 'గ్యాంగ్ లీడర్స్','వ్యాపారి' వచ్చాయి. ఇక వీటిల్లో ఖుషి,పులి చిత్రాల డైరక్టర్ ఎస్.జె.సూర్య హీరోగా చేసిన 'వ్యాపారి' ఓ మాదిరిగా ఫరవాలేదనిపించుకుంది. కన్నడ డబ్బింగ్ 'గ్యాంగ్ లీడర్స్' అయితే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. శాటిలైట్ కోసం తీసిన చిత్రంలా ఉన్న ఈ సినిమా అక్కడా ఓ మోస్తరు రిజల్ట్ నే నమోదు చేసింది. ఇక అప్పట్లో 'ఆరోప్రాణం' చిత్రం తీసిన వీరూ ద్వైత్ ఈ సారి శ్రీహరితో సామ్రాజ్యం చేసాడు. కానీ కధాశం ఎన్నుకోవటంలో తడబడటంతో బి, సి సెంటర్స్ ని కూడా అది అలరించే వాతావరణం కనపడటంలేదు. ఇక అడుగు గురించి అడిగేనాధుడే కరువయ్యారు. వీటిన్నటికీ తోడు అంతకు ముందు వారం రిలీజైన 'ఓయ్' కలెక్షన్స్ కూడా డ్రాపవటం ఇబ్బందికరంగా మారింది.


Click it and Unblock the Notifications











