Rama Banam Collections: నష్టాల ఊబిలో రామబాణం.. గోపీచంద్‌కు మళ్లీ దెబ్బే.. టార్గెట్ కష్టమే!

మ్యాచో హీరో గోపీచంద్ కు లక్ష్యం, లౌక్యం వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు అందించిన దర్శకుడు శ్రీవాస్. తాజాగా ఆయన దర్శకత్వంలో గోపీచంద్ మూడోసారి హీరోగా నటించిన చిత్రం రామబాణం. నందమూరి నటిసింహం బాలకృష్ణ చెప్పిన టైటిల్ తో వచ్చిన ఈ మూవీ ట్రైలర్, టీజర్, సాంగ్స్, పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ లభించింది. అయితే మే 5న థియేటర్లలో విడుదలైన రామ బాణం సినిమాపై ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. దీంతో వసూళ్లు పేలవంగా ఉంటున్నాయి. ఈ క్రమంలో 5వ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయంటే?

మరోసారి బ్రదర్స్ గా : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేసిన మూవీనే రామబాణం. ఇదివరకు లక్ష్యం సినిమాలో అన్నదమ్ముల్లుగా నటించిన గోపీచంద్, జగపతి బాబు మరోసారి ఇందులో బ్రదర్స్ గా అలరించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించకోవడంతో వసూళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి.

ramabanam

ప్రీ రిలీజ్ బిజినెస్ : గోపీచంద్ మార్కెట్ కు తగినట్లుగానే రామ బాణం సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. నైజాంలో రూ. 4.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.00 కోట్లతో తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 12.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 80 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లు ఇవన్నీ యాడ్ చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా రూ. 14.50 కోట్ల బిజినెస్ అయింది.

ramabanam

థియేటర్ ఆక్యుపెన్సీ :రామబాణం చిత్రానికి మిక్కి జే మేయర్ సంగీతం అందించారు. అయితే ఆయన మ్యూజిక్ పెద్దగా ఉపయోగపడలేదని అంటున్నారు. మిక్కీ సంగీతంపై కూడా పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రామబాణం మూవీ 5వ రోజు థియేటర్ ఆక్యుపెన్సీని మరి తక్కువగా ఉంది. ఉదయం 12.35 శాతం, మధ్యాహ్నం 15.79 శాతం సాయంత్రం 15.75 శాతంగా నమోదు అయింది.

ramabanam

5వ రోజు కలెక్షన్స్ : డస్కీ బ్యూటి డింపుల్ హయాతి హీరోయిన్ గా చేసిన లేటెస్ట్ మూవీ రామ బాణం. ఇందులో డింపుల్ హయాతి యూట్యూబర్ గా నటించింది. ఈ ముద్దగుమ్మ అందచందాలు కూడా సినిమా హిట్టుకు ఉపయోగపడట్లేదని టాక్ వస్తోంది. రామ బాణం సినిమాకు 5వ రోజున రూ. 88 లక్షల నెట్ ఇండియా కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక 5 రోజుల్లో రూ. 6.74 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టగలుగుతుందని అంచనా.

ramabanam

బ్రేక్ ఈవెన్ కోసం రావాల్సింది : రామబాణం సినిమాకు ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున రూ. 1.17 కోట్లు, 2వ రోజు రూ. 81 లక్షలు, 3వ రోజు రూ. 65 లక్షలు, నాలుగో రోజున రూ. 29 లక్షలు వచ్చాయి. మొత్తంగా 4 రోజుల్లో రూ. 2.92 కోట్ల షేర్, రూ. 5.85 కోట్ల గ్రాస్ రాగా వరల్డ్ వైడ్ గా రూ. 3.09 కోట్ల షేర్, రూ. 6.45 కోట్ల గ్రాస్ వసూలైంది. ఇక ఐదో రోజున రూ. 40 లక్షల షేర్ వసూళు కానున్నట్లు తెలుస్తోంది. ఇలా అయితే బ్రేక్ ఈవెన్ కు రూ. 11.70 కోట్లు రావాల్సి ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X