వరస ఫ్లాపుల హీరో గోపీచంద్ కి అంత మార్కెట్టా?
'శౌర్యం','గోలీమార్', 'వాంటెడ్' అంటూ వరస ఫ్లాపులు వస్తున్నా గోపీచంద్ కి వరసలో సినిమా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి.దీనకి కారణం ఏమిటీ అంటే అతనికున్న నిలకడగలిగిన మార్కెట్ అంటున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మార్కెట్ 15 కోట్లు అని తేలుస్తున్నారు. ముఖ్యంగా బి, సి సెంటర్లలో గోపీచంద్ కి ఇప్పటికీ మంచి ఓపెనింగ్స్ ఉండటమే దానకి కారణం. మల్టిప్లెక్స్ లలో అతనికి మార్కెట్ అంతంత మాత్రంగా ఉన్నా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, ఎ సెంటర్లులలో గోపీచంద్ సినిమా పరిస్ధితి బాగానే ఉంది. అయితే మాస్ హీరోగా ఎదుగుతున్న గోపీచంద్‌కు ఒక హిట్ వస్తే రెండు ఫ్లాప్‌లు తప్పడంలేదు. వన్‌మేన్ షో కథలు అంగీకరించడం వల్ల ఈ సమస్య ఎదురవుతోందని పరిశ్రమలోని సీనియర్స్ విశ్లేషిస్తున్నారు. గోపిచంద్‌కు సుమారుగా 15 కోట్ల వ్యాపారంతో స్థిరమైన మార్కెట్ ఉందంటున్నారు. దీనిని స్థిరంగా నిలుపుకుంటూ మరింత పెంచుకోగలిగితే టాప్ హోరోల్లో ఒకరిగా నిలుస్తాడని చెప్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్..కృష్ణవంశీ దర్శకత్వంలో మొగుడు చిత్రం చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











