Pakka Comercial Pre Release Bussiness: ఈసారి పెద్ద టార్గెట్ తో వస్తున్న గోపీచంద్.. ఎంత రావాలంటే?
మాచో యాక్షన్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మాస్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న గోపీచంద్ ఈసారి పక్క కమర్షియల్ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలి అని రెడీ అవుతున్నాడు. కమర్షియల్ సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న మారుతీ దర్శకత్వంలో తనకెక్కిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. ఇక యూవి క్రియేషన్స్ GA2 పిక్చర్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి. జూలై 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది? బ్రేక్ ఈవెన్ ఎంత సాధించాలి? అనే వివరాల్లోకి వెళితే..

వరుస అపజయాలు
మాస్ హీరోగా ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకునే గోపీచంద్ గత కొంతకాలంగా వరుస అపజయాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు లక్ష్యం శౌర్యం సౌఖ్యం సాహసం వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్న గోపీచంద్ ఆ తర్వాత మాత్రం సరైన విజయాలను సొంతం చేసుకోవడం లేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా తీవ్రంగా నిరాశ పరుస్తాయి.

బెస్ట్ కాంబినేషన్
ఇక ఈసారి ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని మారుతీ దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో గోపీచంద్ మొదటిసారి ఒక లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక హీరోయిన్ గా రాశి కన్నా నటించిన విషయం తెలిసిందే. ఇదివరకే వీరి కలయికలో జిల్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా కూడా కమర్షియల్ గా బాగానే అడిగింది. ఇక యూవీ క్రియేషన్స్ GA2 పిక్చర్స్ మారుతి కలయికకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఈ సినిమాకు మంచి బిజినెస్ ఐతే జరిగింది.

ప్రమోషన్స్ తో హైప్
అసలైతే 'పక్కా కమర్షియల్' సినిమాను రెండు నెలల క్రితమే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కోవిడ్ కారణంగా మిగతా సినిమాల రిలీజ్ డేట్స్ తో క్లాష్ అవ్వడంతో ఇంత కాలం ఎదురు చూడాల్సి వచ్చింది. ఇక చిత్ర యూనిట్ సభ్యులు అయితే గత కొన్ని రోజులుగా ప్రమోషన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా ముందుకు సాగుతున్నారు కొన్ని ప్రత్యేకమైన ఇంటర్వ్యూలతో కూడా సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయింది.

ప్రీ రిలీజ్ బిజినెస్
ఇక మంచి కాంబినేషన్ ఏర్పడడంతో పక్కా కమర్షియల్ సినిమా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా మంచి బిజినెస్ ఏర్పడింది. ఇక నైజాం ఏరియాలో 6 కోట్ల ధర పలికిన ఈ సినిమా సీడెడ్ లో 2.50 50 కోట్లు బిజినెస్ చేసింది. మొత్తంగా ఏపీ తెలంగాణలో 17.50 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
Recommended Video


ఎంత రావాలంటే?
ఇక కర్ణాటక అలాగే రెస్టాఫ్ ఇండియా మొత్తంగా చూసుకుంటే 50 లక్షల వరకు బిజినెస్ చేసిన పక్కా కమర్షియల్ సినిమా ఓవర్సీస్ లో 1.25 కోట్ల వరకు ధర పలికినట్లు తెలుస్తోంది. ఇక ఈ విధంగా మొత్తం వరల్డ్ వైడ్ గా 19.20 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన పక్కా కమర్షియల్ సినిమా 20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదల అవుతోంది. మరి ఆ టార్గెట్ ను ఈ సినిమా ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











