Pakka Commercial Collections: ఆదివారం ఊహించని వసూళ్లు.. గోపీచంద్ మూవీకి ఎన్ని కోట్లు రావాలంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే సక్సెస్‌లను అందుకుంటూ ఉండగా.. మరికొందరు మాత్రం అన్నీ ఉన్నా హిట్లు మాత్రం రావడం లేదు. అలా చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తోన్న హీరోల్లో మ్యాచో స్టార్ గోపీచంద్ ఒకడు. గత ఏడాది 'సీటీమార్'తో ఏవరేజ్ హిట్‌ను అందుకున్న అతడు.. ఇటీవలే 'పక్కా కమర్షియల్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయింది. కానీ, దీనికి కలెక్షన్లు ఆరంభం నుంచే నిరాశగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా 10 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

 కమర్షియల్‌గా వచ్చిన గోపీచంద్

కమర్షియల్‌గా వచ్చిన గోపీచంద్

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా మారుతి రూపొందించిన చిత్రమే 'పక్కా కమర్షియల్'. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించింది. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ3 బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జాక్స్ బెజాయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఇందులో సత్యరాజ్, రావు రమేష్ సహా చాలా మంది కీలక పాత్రల్లో కనిపించారు.

పక్కా కమర్షియల్ బిజినెస్ ఇలా

పక్కా కమర్షియల్ బిజినెస్ ఇలా

టాలెంటెడ్ స్టార్ గోపీచంద్ నటించిన'పక్కా కమర్షియల్' మూవీ నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 7.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలిపి ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 15.20 కోట్ల బిజినెస్‌ను జరుపుకుంది.

10వ రోజు ఎక్కడ.. ఎంతొచ్చింది

10వ రోజు ఎక్కడ.. ఎంతొచ్చింది

చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తోన్న గోపీచంద్.. మారుతి దర్శకత్వంలో నటించిన సినిమానే 'పక్కా కమర్షియల్'. దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి ఫస్ట్ వీకెండ్ మినహా కలెక్షన్లు పెద్దగా రాలేదు. ఈ నేపథ్యంలో 10వ రోజైన ఆదివారం మాత్రం కాస్తంత పెరిగి రెండు రాష్ట్రాల్లో రూ. 8 లక్షలు షేర్‌ను రాబట్టింది.

 10 రోజులకు కలిపి ఎంతొచ్చింది

10 రోజులకు కలిపి ఎంతొచ్చింది

10 రోజుల్లో 'పక్కా కమర్షియల్'కు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లిలా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 2.25 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.09 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.10 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 63 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 48 లక్షలు, గుంటూరులో రూ. 56 లక్షలు, కృష్ణాలో రూ. 56 లక్షలు, నెల్లూరులో రూ. 34 లక్షలతో.. రూ. 7.01 కోట్లు షేర్, రూ. 11.60 కోట్లు గ్రాస్ దక్కింది.

 ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 రోజుల్లో రూ. 7.01 కోట్లు షేర్ రాబట్టిన 'పక్కా కమర్షియల్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా అంతగా రాణించలేదు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 33 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 85 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపి 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా గోపీచంద్ సినిమాకు రూ. 8.18 షేర్‌తో పాటు రూ. 14.00 కోట్లు గ్రాస్‌ వసూలు అయింది.

 బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

గోపీచంద్ - రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన 'పక్కా కమర్షియల్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16 కోట్లుగా నమోదైంది. ఇక, 10 రోజుల్లో దీనికి రూ. 8.18 కోట్లు వచ్చాయి. అంటే మరో 7.82 కోట్లు వస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X