Pakka Commercial Collections: 16 కోట్ల టార్గెట్.. వారంలో అన్ని కోట్లు.. ఇంకెంత వస్తే హిట్ అంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు మ్యాచో స్టార్ గోపీచంద్. కెరీర్ ఆరంభంలోనే మాస్ హీరోగా గుర్తింపును తెచ్చుకున్న అతడు.. ఎన్నో విజయాలను కూడా అందుకున్నాడు. అయితే, కొంత కాలంగా ఈ టాలెంటెడ్ హీరోకు సరైన బ్రేక్ రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే గోపీచంద్ 'పక్కా కమర్షియల్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. కానీ, దీనికి కలెక్షన్లు నిరాశగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా మొదటి వారం బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

గోపీచంద్ పక్కా కమర్షియల్‌ రోల్

గోపీచంద్ పక్కా కమర్షియల్‌ రోల్

మ్యాచో స్టార్ గోపీచంద్ - మారుతి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'పక్కా కమర్షియల్'. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించింది. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ3 బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జాక్స్ బెజాయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఇందులో సత్యరాజ్, రావు రమేష్ సహా కొందరు ప్రముఖులు కీలక పాత్రలు చేశారు.

పక్కా కమర్షియల్ బిజినెస్ ఇలా

పక్కా కమర్షియల్ బిజినెస్ ఇలా

గోపీచంద్ మార్కెట్ అనుగుణంగానే 'పక్కా కమర్షియల్' మూవీ నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 7.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలిపి ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 15.20 కోట్ల బిజినెస్‌ను చేసుకుంది.

7వ రోజు ఎక్కడ.. ఎంతొచ్చింది

7వ రోజు ఎక్కడ.. ఎంతొచ్చింది


ఏపీ, తెలంగాణలో 'పక్కా కమర్షియల్' మూవీకి 7వ రోజు వసూళ్లు మరింతగా తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 6 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రూ. 15 లక్షలు షేర్, రూ. 25 లక్షలు గ్రాస్ మాత్రమే వచ్చింది.

7 రోజులకు కలిపి ఎంతొచ్చింది

7 రోజులకు కలిపి ఎంతొచ్చింది

తెలుగు రాష్ట్రాల్లో 'పక్కా కమర్షియల్' మూవీకి ఫస్ట్ వీక్ వసూళ్లిలా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 2.18 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.06 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.07 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 62 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 48 లక్షలు, గుంటూరులో రూ. 54 లక్షలు, కృష్ణాలో రూ. 53 లక్షలు, నెల్లూరులో రూ. 33 లక్షలతో.. రూ. 6.81 కోట్లు షేర్, రూ. 11.25 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వారం రోజుల్లో రూ. 6.81 కోట్లు షేర్ రాబట్టిన 'పక్కా కమర్షియల్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా నిరాశనే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 32 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 82 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపి 7 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా గోపీచంద్ సినిమాకు రూ. 7.95 షేర్‌తో పాటు రూ. 13.52 కోట్లు గ్రాస్‌ వసూలు అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?


గోపీచంద్ హీరోగా మారుతి తెరకెక్కించిన 'పక్కా కమర్షియల్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16 కోట్లుగా నమోదైంది. ఇక, మొదటి వారం రోజుల్లో దీనికి రూ. 7.95 కోట్లు వచ్చాయి. అంటే మరో 8.05 కోట్లు వస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.

నిర్మాతలకు మాత్రం లాభాలేనట

నిర్మాతలకు మాత్రం లాభాలేనట

గోపీచంద్ - రాశీ ఖన్నా జంటగా నటించిన 'పక్కా కమర్షియల్' మూవీకి పబ్లిసిటీతో కలిసి రూ. 36 కోట్లు బడ్జెట్ అయినట్లు తెలిసింది. అయితే, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే నిర్మాతలకు రూ. 32 కోట్లు వచ్చేశాయి. దీంతో ఈ సినిమాను కొన్ని ప్రాంతాల్లో సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. ఫలితంగా ఈ సినిమా వీకెండ్‌లోనే నిర్మాతలకు లాభాలను అందించి పెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X