Don't Miss!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Pakka Commercial Collections: మరింత తగ్గిన వసూళ్లు.. 5 రోజుల్లో అన్ని కోట్లు.. లాభమా నష్టమా అంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో మ్యాచో స్టార్ గోపీచంద్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచే ఇదే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్న అతడు జయాపజయాలతో ముందుకు సాగుతున్నాడు. ఈ మధ్య కాలంలో మాత్రం అతడికి సరైన బ్రేక్ దక్కలేదనే చెప్పుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది వచ్చిన 'సీటీమార్'తో గోపీచంద్‌కు ఊరట లభించింది. దీని తర్వాత అతడు నటించిన చిత్రమే 'పక్కా కమర్షియల్'. భారీ అంచనాలతో గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా 5 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!
పక్కా కమర్షియల్‌గా వచ్చిన హీరో
మ్యాచో స్టార్ గోపీచంద్ - మారుతి కాంబోలో వచ్చిన చిత్రమే 'పక్కా కమర్షియల్'. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్గా నటించింది. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ3 బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జాక్స్ బెజాయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఇందులో సత్యరాజ్, రావు రమేష్ సహా పలువురు ప్రముఖులు కీలక పాత్రలు చేశారు.
జబర్ధస్త్ వర్ష అందాల ఆరబోత: ఉల్లిపొరలాంటి చీరలో అదిరిపోయే హాట్ ట్రీట్
పక్కా కమర్షియల్ బిజినెస్ ఇలా
గోపీచంద్ మార్కెట్ అనుగుణంగానే 'పక్కా కమర్షియల్' మూవీ నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 7.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్లో రూ. 1.30 కోట్లతో కలిపి ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 15.30 కోట్ల బిజినెస్‌ను జరుపుకుంది.
5వ రోజు ఎక్కడ.. ఎంతొచ్చింది
'పక్కా కమర్షియల్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు వసూళ్లు మరింతగా తగ్గిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 13 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 6 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రూ. 38 లక్షలు షేర్, రూ. 60 లక్షలు గ్రాస్ వచ్చింది.
సుమ షోలో యంగ్ హీరోకు అవమానం: మొబైల్ విసిరేసిన యాంకర్.. కోపంతో వెళ్లిపోయిన స్టార్ కిడ్
5 రోజులకు కలిపి ఎంతొచ్చింది
'పక్కా కమర్షియల్' మూవీకి ఏపీ, తెలంగాణలో 5 రోజుల్లో వసూళ్లిలా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 2.04కోట్లు, సీడెడ్‌లో రూ. 1.01 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.00 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 59 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 46 లక్షలు, గుంటూరులో రూ. 51 లక్షలు, కృష్ణాలో రూ. 49 లక్షలు, నెల్లూరులో రూ. 33 లక్షలతో.. రూ. 6.43 కోట్లు షేర్, రూ. 10.60 కోట్లు గ్రాస్ దక్కింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 6.43 కోట్లు షేర్ రాబట్టిన 'పక్కా కమర్షియల్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా అంతగా రాణించలేదు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 30 లక్షలు, ఓవర్సీస్లో రూ. 78 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపి 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా గోపీచంద్ సినిమాకు రూ. 7.51 షేర్‌తో పాటు రూ. 12.73 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
తెలుగు పిల్ల అనన్య నాగళ్ల పరువాల విందు: వామ్మో ఆమెనిలా చూశారంటే!
బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
గోపీచంద్ - రాశీ ఖన్నా కాంబోలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'పక్కా కమర్షియల్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో దీనికి రూ. 7.51 కోట్లు వచ్చాయి. అంటే మరో 8.49 కోట్లు వస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను చేరుతుంది.
నిర్మాతలకు మాత్రం లాభాలేనట
'పక్కా కమర్షియల్' మూవీకి పబ్లిసిటీతో కలిసి రూ. 35 కోట్లు బడ్జెట్ అయినట్లు తెలిసింది. అయితే, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే నిర్మాతలకు రూ. 32 కోట్లు వచ్చేశాయి. దీంతో ఈ సినిమాను కొన్ని ప్రాంతాల్లో సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. ఫలితంగా ఈ సినిమా వీకెండ్లోనే టార్గెట్‌ను పూర్తి చేసుకుంది. దీంతో నిర్మాతలకు ఇప్పటికే కొన్ని కోట్ల లాభాలు దక్కాయట.