twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pakka Commercial Collections: గోపీచంద్‌కు బిగ్ షాక్.. మరింత తగ్గిన వసూళ్లు.. వాళ్లకు మాత్రం లాభమే

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో పక్కా కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ.. అటు క్లాస్, ఇటు మాస్ ఆడియెన్స్‌ను అలరిస్తూ దూసుకెళ్తోన్న హీరోనే మ్యాచో స్టార్ గోపీచంద్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకున్న అతడు.. చాలా కాలంగా సరైన బ్రేక్ లేక ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. దీంతో ఆ సారి ఎలాగైనా సక్సెస్‌ను అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు.

    ఇందుకోసం ఇటీవలే గోపీచంద్ 'పక్కా కమర్షియల్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలైంది. కానీ, దీనికి వసూళ్లు మాత్రం అంతగా రావట్లేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా 6 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

    పక్కా కమర్షియల్‌గా వచ్చేశాడుగా

    పక్కా కమర్షియల్‌గా వచ్చేశాడుగా

    మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా మారుతి రూపొందించిన చిత్రమే 'పక్కా కమర్షియల్'. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించింది. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ3 బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జాక్స్ బెజాయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఇందులో సత్యరాజ్, రావు రమేష్ సహా కొందరు ప్రముఖులు ఇందులో నటించారు.

    మళ్లీ రెచ్చిపోయిన తెలుగు యాంకర్: చీరలోనూ హాట్‌గా.. ఈ వీడియో చూశారంటే!మళ్లీ రెచ్చిపోయిన తెలుగు యాంకర్: చీరలోనూ హాట్‌గా.. ఈ వీడియో చూశారంటే!

    పక్కా కమర్షియల్ బిజినెస్ ఇలా

    పక్కా కమర్షియల్ బిజినెస్ ఇలా

    'పక్కా కమర్షియల్' మూవీ గోపీచంద్ మార్కెట్ అనుగుణంగానే నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 7.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలిపి ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 15.20 కోట్ల బిజినెస్‌ను జరుపుకుంది.

     6వ రోజు ఎక్కడ.. ఎంతొచ్చింది

    6వ రోజు ఎక్కడ.. ఎంతొచ్చింది

    ఏపీ, తెలంగాణలో 'పక్కా కమర్షియల్' మూవీకి 6వ రోజు వసూళ్లు మరింతగా పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 8 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రూ. 23 లక్షలు షేర్, రూ. 40 లక్షలు గ్రాస్ వచ్చింది.

    తెలుగు పిల్ల అనన్య నాగళ్ల పరువాల విందు: వామ్మో ఆమెనిలా చూశారంటే!తెలుగు పిల్ల అనన్య నాగళ్ల పరువాల విందు: వామ్మో ఆమెనిలా చూశారంటే!

    6 రోజులకు కలిపి ఎంతొచ్చింది

    6 రోజులకు కలిపి ఎంతొచ్చింది

    తెలుగు రాష్ట్రాల్లో 'పక్కా కమర్షియల్' మూవీకి 6 రోజుల్లో వసూళ్లిలా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 2.12 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.04 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.04 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 61 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 47 లక్షలు, గుంటూరులో రూ. 53 లక్షలు, కృష్ణాలో రూ. 51 లక్షలు, నెల్లూరులో రూ. 34 లక్షలతో.. రూ. 6.66 కోట్లు షేర్, రూ. 11.00 కోట్లు గ్రాస్ దక్కింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 6 రోజుల్లో రూ. 6.66 కోట్లు షేర్ రాబట్టిన 'పక్కా కమర్షియల్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా నిరాశనే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 31 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 80 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపి 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా గోపీచంద్ సినిమాకు రూ. 7.77 షేర్‌తో పాటు రూ. 13.20 కోట్లు గ్రాస్‌ వసూలు అయింది.

    నాగబాబుకు ఫేమస్ కమెడియన్ వార్నింగ్: ఏమనుకుంటున్నావ్.. ఇది కరెక్ట్ కాదు అంటూ!నాగబాబుకు ఫేమస్ కమెడియన్ వార్నింగ్: ఏమనుకుంటున్నావ్.. ఇది కరెక్ట్ కాదు అంటూ!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    గోపీచంద్ - మారుతి కలయికలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'పక్కా కమర్షియల్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లో దీనికి రూ. 7.77 కోట్లు వచ్చాయి. అంటే మరో 8.23 కోట్లు వస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను చేరుతుంది.

    నిర్మాతలకు మాత్రం లాభాలేనట

    నిర్మాతలకు మాత్రం లాభాలేనట

    గోపీచంద్ హీరోగా, రాశీ ఖన్నా హీరోయిన్‌గా రూపొందిన 'పక్కా కమర్షియల్' మూవీకి పబ్లిసిటీతో కలిసి రూ. 36 కోట్లు బడ్జెట్ అయినట్లు తెలిసింది. అయితే, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే నిర్మాతలకు రూ. 32 కోట్లు వచ్చేశాయి. దీంతో ఈ సినిమాను కొన్ని ప్రాంతాల్లో సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. ఫలితంగా ఈ సినిమా వీకెండ్‌లోనే నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.

    English summary
    Gopichand Did Pakka Commercial movie Under Maruthi Direction. This Movie Collects Rs 7.77 Crores in 6 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X