Pakka Commercial Collections: గోపీచంద్‌కు బిగ్ షాక్.. 8వ రోజు ఘోరంగా.. ఇంకెంత రావాలంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో పక్కా మాస్ అండ్ కమర్షియల్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. సుదీర్ఘ కాలంగా మార్కును చూపిస్తూ దూసుకుపోతోన్నాడు మ్యాచో స్టార్ గోపీచంద్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకుని స్టార్‌గా ఎదిగిపోయిన అతడు.. క్రమంగా తన మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ వస్తున్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో గోపీచంద్‌కు సరైన హిట్ అందలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్టార్ హీరో ఇటీవలే'పక్కా కమర్షియల్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. కానీ, దీనికి కలెక్షన్లు నిరాశగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా 8 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

పక్కా కమర్షియల్‌గా వచ్చేశాడు

పక్కా కమర్షియల్‌గా వచ్చేశాడు


టాలీవుడ్ స్టార్ గోపీచంద్ హీరోగా మారుతి రూపొందించిన చిత్రమే 'పక్కా కమర్షియల్'. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించింది. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ3 బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జాక్స్ బెజాయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఇందులో సత్యరాజ్, రావు రమేష్ సహా చాలా మంది ఇందులో నటించారు.

పక్కా కమర్షియల్ బిజినెస్ ఇలా

పక్కా కమర్షియల్ బిజినెస్ ఇలా


'పక్కా కమర్షియల్' మూవీ గోపీచంద్ మార్కెట్ అనుగుణంగానే నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 7.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలిపి ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 15.20 కోట్ల బిజినెస్‌ను జరుపుకుంది.

8వ రోజు ఎక్కడ.. ఎంతొచ్చింది

8వ రోజు ఎక్కడ.. ఎంతొచ్చింది


'పక్కా కమర్షియల్' మూవీకి 7వ రోజు ఏపీ, తెలంగాణలో వసూళ్లు ఘోరంగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 2 లక్షలు, సీడెడ్‌లో రూ. 1 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. - లక్షలు, గుంటూరులో రూ. - లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. - లక్షలతో.. రూ. 6 లక్షలు షేర్, రూ. 10 లక్షలు గ్రాస్ వచ్చింది.

8 రోజులకు కలిపి ఎంతొచ్చింది

8 రోజులకు కలిపి ఎంతొచ్చింది

'పక్కా కమర్షియల్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల్లో వసూళ్లిలా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 2.20 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.07 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.08 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 63 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 48 లక్షలు, గుంటూరులో రూ. 54 లక్షలు, కృష్ణాలో రూ. 54 లక్షలు, నెల్లూరులో రూ. 33 లక్షలతో.. రూ. 6.87 కోట్లు షేర్, రూ. 11.35 కోట్లు గ్రాస్ దక్కింది.

 ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది


ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 8 రోజుల్లో రూ. 6.87 కోట్లు షేర్ రాబట్టిన 'పక్కా కమర్షియల్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా నిరాశనే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 32 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 83 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపి 8 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా గోపీచంద్ సినిమాకు రూ. 8.02 షేర్‌తో పాటు రూ. 13.64 కోట్లు గ్రాస్‌ వసూలు అయింది.

 బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?


గోపీచంద్ - రాశీ ఖన్నా కాంబోలో వచ్చిన 'పక్కా కమర్షియల్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16 కోట్లుగా నమోదైంది. ఇక, 8 రోజుల్లో దీనికి రూ. 8.02 కోట్లు వచ్చాయి. అంటే మరో 7.98 కోట్లు వస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X