Pakka Commercial Collections: వీకెండ్‌లో గోపీచంద్‌కు దెబ్బ.. 9వ రోజే ఇంత తక్కువ వసూళ్లా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులను బేరీజు వేసుకోకుండా సినిమాల చేసుకుంటూ వెళ్లే హీరోల్లో మ్యాచో స్టార్ గోపీచంద్ ఒకడు. కెరీర్ ఆరంభంలోనే పక్కా కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకున్న అతడు.. మధ్యలో కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేశాడు. కానీ, అవి వర్కౌట్ కాకపోవడంతో మళ్లీ తన పంథాలోకి వచ్చేశాడు. ఈ క్రమంలోనే గత ఏడాది 'సీటీమార్' సినిమాను చేశాడు. ఇక, ఇటీవలే గోపీచంద్ 'పక్కా కమర్షియల్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. కానీ, దీనికి కలెక్షన్లు నిరాశగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా 9 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

పక్కా కమర్షియల్‌గా గోపీచంద్
టాలెంటెడ్ హీరో గోపీచంద్ - మారుతి కాంబోలో వచ్చిన చిత్రమే 'పక్కా కమర్షియల్'. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించింది. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ3 బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జాక్స్ బెజాయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఇందులో సత్యరాజ్, రావు రమేష్ సహా చాలా మంది కీలక పాత్రలను పోషించారు.

పక్కా కమర్షియల్ బిజినెస్ ఇలా
మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన'పక్కా కమర్షియల్' మూవీ నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 7.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలిపి ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 15.20 కోట్ల బిజినెస్‌ను చేసుకుంది.

9వ రోజు ఎక్కడ.. ఎంతొచ్చింది
తెలుగు సినీ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న గోపీచంద్ - డైరెక్టర్ మారుతి కలయికలో రూపొందిన సినిమానే 'పక్కా కమర్షియల్'. దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి ఫస్ట్ వీకెండ్ మినహా కలెక్షన్లు పెద్దగా రాలేదు. ఈ నేపథ్యంలో 9వ రోజైన శనివారం మాత్రం రెండు రాష్ట్రాల్లో రూ. 6 లక్షలు షేర్ మాత్రమే దక్కింది.

9 రోజులకు కలిపి ఎంతొచ్చింది
'పక్కా కమర్షియల్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 9 రోజుల్లో వసూళ్లిలా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 2.22 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.08 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.09 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 63 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 48 లక్షలు, గుంటూరులో రూ. 55 లక్షలు, కృష్ణాలో రూ. 55 లక్షలు, నెల్లూరులో రూ. 33 లక్షలతో.. రూ. 6.93 కోట్లు షేర్, రూ. 11.45 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
9 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 6.93 కోట్లు షేర్ రాబట్టిన 'పక్కా కమర్షియల్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా అంతగా రాణించలేదు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 32 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 84 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపి 9 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా గోపీచంద్ సినిమాకు రూ. 8.09 షేర్‌తో పాటు రూ. 13.76 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
గోపీచంద్ - రాశీ ఖన్నా జంటగా నటించిన 'పక్కా కమర్షియల్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16 కోట్లుగా నమోదైంది. ఇక, 9 రోజుల్లో దీనికి రూ. 8.09 కోట్లు వచ్చాయి. అంటే మరో 7.91 కోట్లు వస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications











