Pakka Commercial Collections: గోపీచంద్‌కు 16 కోట్ల టార్గెట్.. ఫుల్ రన్‌లో ఇంతే.. అన్ని కోట్లు నష్టం

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న హీరోల్లో మ్యాచో స్టార్ గోపీచంద్ ఒకడు. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకున్న అతడు.. స్టార్‌డమ్‌ను అందుకున్నాడు. అప్పటి నుంచి మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'పక్కా కమర్షియల్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. కానీ, దీనికి స్పందన సరిగా రాకపోవడంతో కలెక్షన్లు ఆరంభం నుంచే నిరాశగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా మొత్తంగా ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

కమర్షియల్‌గా ఎంటరైన గోపీచంద్

కమర్షియల్‌గా ఎంటరైన గోపీచంద్

టాలీవుడ్ స్టార్ గోపీచంద్ హీరోగా మారుతి రూపొందించిన చిత్రమే 'పక్కా కమర్షియల్'. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించింది. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ3 బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జాక్స్ బెజాయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఇందులో సత్యరాజ్, రావు రమేష్ సహా చాలా మంది కీలక పాత్రను పోషించారు.

పక్కా కమర్షియల్ బిజినెస్ ఇలా

పక్కా కమర్షియల్ బిజినెస్ ఇలా

మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన'పక్కా కమర్షియల్' మూవీ నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 7.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలిపి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.20 కోట్ల బిజినెస్‌ను జరుపుకుంది.

అలాంటి రెస్పాన్స్.. వసూళ్లిలానే

అలాంటి రెస్పాన్స్.. వసూళ్లిలానే

చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తోన్న గోపీచంద్.. మారుతి దర్శకత్వంలో నటించిన సినిమానే 'పక్కా కమర్షియల్'. ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. కానీ, దీనికి ఆరంభంలోనే నెగెటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమాకు కలెక్షన్లు అంతగా రాలేదు. ప్రపంచ వ్యాప్తంగానూ ఈ సినిమా ప్రభావాన్ని చూపలేకపోయింది.

తెలుగు రాష్ట్రాల్లో ఎంతొచ్చింది?

తెలుగు రాష్ట్రాల్లో ఎంతొచ్చింది?

'పక్కా కమర్షియల్' మూవీకి ఫుల్ రన్‌లో తెలుగు రాష్ట్రాల్లో నిరాశే ఎదురైంది. ఫలితంగా నైజాంలో రూ. 2.40 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.16 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.18 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 68 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 50 లక్షలు, గుంటూరులో రూ. 60 లక్షలు, కృష్ణాలో రూ. 63 లక్షలు, నెల్లూరులో రూ. 36 లక్షలతో.. రూ. 7.51 కోట్లు షేర్, రూ. 12.50 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఫుల్ రన్‌లో రూ. 7.51 కోట్లు షేర్ రాబట్టిన 'పక్కా కమర్షియల్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా అంతగా రాణించలేదు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 35 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 90 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపి ప్రపంచ వ్యాప్తంగా గోపీచంద్ సినిమాకు రూ. 8.81 షేర్‌తో పాటు రూ. 15.30 కోట్లు గ్రాస్‌ మాత్రమే వసూలు అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. నష్టమెంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. నష్టమెంత?

గోపీచంద్ - రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన 'పక్కా కమర్షియల్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16 కోట్లుగా నమోదైంది. ఇక, ఫుల్ రన్‌లో దీనికి రూ. 8.81 కోట్లు వచ్చాయి. ఫలితంగా గోపీచంద్ మూవీకి రూ 7.19 కోట్లు నష్టాలను చవి చూసింది.

ఆ ఓటీటీలో సందడి చేయాలని

ఆ ఓటీటీలో సందడి చేయాలని

మారుతి దర్శకత్వంలో గోపీచంద్ నటించిన 'పక్కా కమర్షియల్' మూవీ థియేటర్లలో పెద్దగా సందడి చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కమర్షియల్ సినిమాను ఆగస్టు 5వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X