Pakka Commercial Day 4 Collections: ఒక్కసారిగా కలెక్షన్స్ డౌన్.. ఇంకా ఆ స్థాయిలో రావాలంటే కష్టమే!
మాస్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న గోపీచంద్ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ చూసి చాలా కాలమయ్యింది. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో అతను ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని అనుకున్నాడు. ఇక వీకెండ్ లో ఈ సినిమా కలెక్షన్స్ బాగానే వచ్చినప్పటికీ ఆ తర్వాత మాత్రం కలెక్షన్స్ మళ్లీ ఒక్కసారిగా డౌన్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి ఎంత? బాక్సాఫీస్ వద్ద ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసింది? సక్సెస్ అవ్వాలి అంటే ఇంకా ఎంత కలెక్ట్ చేయాలి? ఇక నాలుగు రోజుల్లో సినిమా ఎంత కలెక్ట్ చేసింది? అనే వివరాల్లోకి వెళితే..

మంచి బిజినెస్
గోపీచంద్ మారుతి కలయికలో సినిమా వస్తోంది అనగానే మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఏర్పడింది. దీంతోపక్కా కమర్షియల్ సినిమాకు వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ విధంగా జరిగింది. నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో రూ. 7.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.30 కోట్లతో కలిపి ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 15.30 కోట్ల బిజినెస్ చేసింది.

4వ రోజు ఎంత వచ్చాయంటే?
గోపిచంద్ 'పక్కా కమర్షియల్' సినిమా తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజు వసూళ్లు చాలా వరకు తగ్గిపోయాయి. ఇక ఏరియాల వారిగా చూసుకుంటే నైజాంలో రూ. 18 లక్షలు, సీడెడ్‌లో రూ. 9 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో.. రూ. 56 లక్షలు షేర్, రూ. 95 లక్షలు గ్రాస్ వచ్చింది.

4 రోజుల్లో వచ్చిన టోటల్ షేర్
రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా టోటల్ గా 'పక్కా కమర్షియల్' సినిమా 4 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 1.91 కోట్లు, సీడెడ్‌లో రూ. 95 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 94 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 55 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 44 లక్షలు, గుంటూరులో రూ. 44 లక్షలు, కృష్ణాలో రూ. 48 లక్షలు, నెల్లూరులో రూ. 32 లక్షలతో మొత్తంగా రూ. 6.05 కోట్లు షేర్, రూ. 10 కోట్లు గ్రాస్ లభించింది.

వరల్డ్ వైడ్ కలెక్షన్స్
4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పక్కా కమర్షియల్ సినిమా రూ. 6.05 కోట్లు షేర్ అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 29 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 75 లక్షలు వసూలు చేసింది. ఇక టోటల్ గా 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా గోపీచంద్ సినిమాకు రూ. 7.09 కోట్ల షేర్, రూ. 12.05 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

ఇంకా ఎంత రావాలంటే..
పక్కా కమర్షియల్ సినిమా వరల్డ్ వైడ్ గా 15.20 కోట్లు మేర బిజినెస్ చేయగా బాక్సాఫీస్ వద్ద 16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైంది. ఇక ఇక 4 రోజుల్లో సినిమాకు కేవలం 7.09 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. అంటే మరో 8.91 కోట్లు వస్తేనే హిట్ అయినట్లు లెక్క. మరి మిగతా వీక్ డేస్ లో ఈ సినిమా ఇంకా ఎలాంటి వసూళ్ళను అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











