షాకింగ్‌గా చాణక్య కలెక్షన్లు.. నష్టాల నుంచి బయటపడాలంటే ఎంత రాబట్టాలంటే
యాంగ్రీ యంగ్ మ్యాన్ గోపిచంద్‌కు సరైన హిట్టు కోసం ప్రయత్నిస్తూ చేసిన చిత్రం చాణక్య. మెహ్రీన్ పిర్జాదా జతకట్టి చేసిన చిత్రం రిలీజ్‌కు ముందు అంచనాలు పెంచింది. ట్రైలర్లు, టీజర్లు ఆకట్టుకొనేలా ఉండటంతో గోపిచంద్ ఖాతాలో హిట్టు చేరడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ దసరా పండుగ కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ క్రమంలో 6 రోజుల కలెక్షన్లు నిరాశజనకంగా కనిపిస్తున్నాయి. గత ఆరు రోజుల్లో చాణక్య ఎంత వసూలు చేసిందంటే..

నైజాం, సీడెడ్‌లో
చాణక్య చిత్రం ప్రీరిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. నైజాంలో ఈ చిత్రాన్ని రూ.3.70 కోట్లు, వైజాగ్‌లో రూ.1.25 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.80 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.70 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.80 లక్షలకు రైట్స్ అమ్మడం జరిగింది.

ఏపీ, తెలంగాణ మొత్తంగా
ఇంకా గుంటూరులో కోటి రూపాయలకుపైగా, నెల్లూరులో 40 లక్షలతో సీడెడ్‌లో రూ.2 కోట్లకు హక్కులు అమ్ముడుపోయాయి. నైజాం, ఏపీ కలిసి మొత్తంగా రూ.10.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో
ఇంకా కర్ణాటకలో చాణక్య చిత్రం హక్కులను రూ.60 లక్షలకు, ఇతర రాష్ట్రాల్లో 10 లక్షలకు, ఓవర్సీస్‌లో రూ.60 లక్షలకు హక్కులు అమ్మడం జరిగింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా రూ.12 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే రిలీజ్ తర్వాత చాణక్య సినిమా కలెక్షన్లు దారుణంగా నమోదయ్యాయి. గతంలో గోపిచంద్‌కు ఇలాంటి వసూళ్లు రాకపోవడంతో షాక్ కలిగించాయి.

లాభం రావాలంటే
చాణక్య చిత్రం గత 6వ రోజు రూ.20 లక్షలు వసూలు చేసింది. దాంతో ఏపీ తెలంగాణలో మొత్తంగా రూ.3.58 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.22 లక్షలు వసూలు చేయడంతో మొత్తంగా రూ.3.91 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక ఈ చిత్రం లాభాల్లోకి ప్రవేశించాలంటే ఇంకా రూ.8 కోట్లకుపైగానే వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.6.65 కోట్ల గ్రాస్‌ను మాత్రమే వసూలు చేయడం గమనార్హం.


Click it and Unblock the Notifications











