గోపిచంద్ సీటిమార్ బాక్సాఫీస్ టార్గెట్.. అందుకోవడం సులువే కానీ..?
యాక్షన్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న తొట్టెంపూడి గోపీచంద్ గత కొంతకాలంగా వరుసగా అపజయాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి అతను సిటీమార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మాస్ ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. సంపత్ నంది గోపీచంద్ కాంబినేషన్ లో ఇదివరకే గౌతమ్ నంద సినిమా వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో అయితే విజయాన్ని అందుకోలేదు. ఇక ఇప్పుడు సిటీమార్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అసలు ఎంత రాబట్టాలి అనే విషయంలోకి వెళితే..

ఆ సినిమా ఎందుకు హిట్టవ్వలేదో అర్థం కాలేదు
కెరీర్ మొదట్లో ఏమైంది ఈ వేళ అనే ఓ చిన్న సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న దర్శకుడు సంపత్ నంది ఆ తర్వాత రామ్ చరణ్ తో రచ్చ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. అనంతరం బెంగాల్ టైగర్ తో మరో హిట్ అందుకొని ఆ వెంటనే గోపిచంద్ తో గౌతమ్ నంద అనే సినిమా చేశాడు. ఈ సినిమా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. కానీ ఎక్కువ ఉంది ఈ సినిమాకు అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందనే విషయం తనకు ఇప్పటికి అర్థం కాదని దర్శకుడు చెబుతున్నాడు.

ఎప్పుడో రవాల్సిన సినిమా..
ఇక ఈ సారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని సంపత్ నంది గోపీచంద్ సిటిమార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా పరిస్థితుల కారణంగా గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఫైనల్ గా వినాయక చవితి సందర్భంగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ప్రీ రిలీజ్ బిజినెస్
ఇంకా సిటీమార్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో అంచనా వేయడం కష్టంగానే ఉంది. కానీ ఒక టార్గెట్ తో ఈ సినిమా రేపు ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. సిటీ మార్ సినిమాను పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల అవుతోంది. దాదాపు 13.23 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ తో సినిమా థియేటర్స్ లోకి రాబోతోందని సమాచారం. ఇంకా ఓవర్సీస్ బిజినెస్ పై క్లారిటీ అయితే రాలేదు. అక్కడ సినిమా విడుదల విషయంలో కూడా ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

సేఫ్ జోన్ లో ఉన్నట్లే
సిటీ మార్ సినిమా బాక్సాఫీస్ వద్ద మినిమం 14 కోట్ల షేర్ సాధిస్తానే లాభల్లోకి వస్తుందని చెప్పవచ్చు. ఈ సినిమాకోసం ఇదే స్థాయిలో బడ్జెట్ పెట్టి ఉండవచ్చని తెలుస్తోంది. అయితే గోపిచంద్ సినిమాలకు తరచుగా హిందీ డబ్బింగ్ ద్వారా మంచి లాభాలు వస్తుంటాయి. ఇక అదే తరహాలో సీటిమార్ కు కూడా మాంచి అమౌంట్ వచ్చినట్లు సమాచారం. అలాగే ఓటీటీ డీల్ తో కూడా నిర్మాతలు దాదాపు సేఫ్ జోన్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
Recommended Video

మరోవైపు నాని సినిమా..?
కానీ థియేట్రికల్ గా సక్సెస్ అవ్వకపోతే మాత్రం కొన్ని నష్టాలు చూడక తప్పదు. అయితే ఇంకా జనాలు థియేటర్స్ మూడ్లోకి రాలేదని చెప్పవచ్చు. ఆ మధ్య విడుదలైన కొన్ని సినిమాలను కూడా ఎవరూ పట్టించుకోలేదు. అయితే గోపీచంద్ యాక్షన్ సినిమా కాబట్టి మాస్ ఆడియన్స్ పండగ రోజు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే నేచురల్ స్టార్ నాని టక్ జగదీష్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మరి ఆ సినిమా ప్రభావం ఎంత వరకు పడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











