గోపీచంద్ రికార్డు: మొగుడు శా. రైట్స్ 3.5 కోట్లు
హీరో గోపీ చంద్ తన కెరియర్ లోనే కొత్త రికార్డును అధిగమించాడు. క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న గోపీ చంద్ తాజా సినిమా మొగుడు శాటిలైట్స్ ఏకంగా రూ. 3.5 కోట్లుకు అమ్ముడు పోయింది. జీ తెలుగు ఛానల్ ఈ భారీ మొత్తాన్ని కైవశం చేసుకుని సినిమా హక్కులను దక్కించుకుంది. ఇప్పటి వరకు వచ్చిన గోపీ చంద్ సినిమాల్లో ఇంత మొత్తాన్ని శాంటిలైట్స్ రూపంలో పొందిన సినిమా మొగుడు మాత్రమే.
ఫ్యామిలీ, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో గోపీ చంద్ సరసన తాప్సీ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రద్దదాస్ రెండో హీరోయిన్ పాత్ర చేస్తోంది. నల్లమలుపు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నరేష్, రోజా అతిథి పాత్రలో కనిపించనుండగా, డాక్టర్ రాజేంద్రప్రసాద్ ముఖ్యమైన పాత్రను పోషించారు. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 21న సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీకాంత్, సమర్పణ: బేబీ భవ్య, నిర్మాణ సంస్థ: లక్ష్మి నరసింహా ప్రొడక్షన్స్.


Click it and Unblock the Notifications











