Rama Banam Collections: రామబాణంకు ఘోరమైన వసూళ్లు.. హిట్టుకు ఎన్ని కోట్లు రావాలంటే?
మ్యాచో హీరో గోపీచంద్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా రామబాణంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లక్ష్యం, లౌక్యం వంటి హిట్ చిత్రాలు అందించిన దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కించిన సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం మిక్స్ డ్ టాక్ తో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో రామబాణం సినిమాకు రెండో రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..
అన్నదమ్ముల్లుగా : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన చిత్రం రామబాణం. ఇదివరకు లక్ష్యం సినిమాలో అన్నదమ్ముల్లుగా నటించిన గోపీచంద్, జగపతి బాబు మరోసారి ఇందులో బ్రదర్స్ క్యారెక్టర్స్ పోషించారు. డస్కీ భామ డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మే 5న విడుదల అయింది.

బిజినెస్.. థియేటర్ కౌంట్: హీరో గోపీచంద్ నటించిన రామబాణం చిత్రానికి తెలుగు రాష్ట్రాలైన నైజాంలో రూ. 4.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.00 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా రూ. 12.50 కోట్ల బిజినెస్ అయింది. ఇక కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 80 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లు కాగా వరల్డ్ వైడ్ గా రూ. 14.50 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే 840 థియేటర్లలో విడుదల అయింది.

థియేటర్ ఆక్యుపెన్సీ: డింపుల్ హయాతి యూట్యూబర్ గా చేసిన రామబాణం సినిమా మొదటి రోజు మిక్స్ డ్ టాక్ అందుకుంది. దీంతో ఆశించిన స్థాయిలో థియేటర్ ఆక్యుపెన్సీ లేదు. ఈ క్రమంలో రామబాణం రెండో రోజు ఆక్యుపెన్సీ వివరాలు చూస్తే.. ఉదయం 13.08 శాతం, మధ్యాహ్నం 21.72 శాతం సాయంత్రం 21.14 శాతంగా నమోదు అయింది. అంటే తొలి రోజు కంటే శనివారం అయిన రెండో రోజు తగ్గినట్లుగా అనిపిస్తోంది.

రెండో రోజు వచ్చింది: మిక్కి జె మేయర్ సంగీతం అందించిన రామబాణం చిత్రానికి పెద్దగా పాజిటివ్ టాక్ రావడం లేదు. ఫలితంగా కలెక్షన్స్ అంతంతమాత్రంగానే ఉన్నాయి. విడుదలైన మొదటి రోజున సినిమాకు రూ. 2.11 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ రాగా.. రెండో రోజున రూ. 1.50 కోట్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అంటే వీకెండ్ అయిన కూడా కలెక్షన్స్ తగ్గాయంటే సినిమా టాక్ కారణంగా తెలుస్తోంది.
2 రోజుల్లో.. బ్రేక్ ఈవెన్ కావాలంటే?: గోపీచంద్-శ్రీవాస్ కాంబినేషన్ లో మూడోసారి వచ్చిన చిత్రం రామబాణం. అలాంటి ఈ సినిమాకు రెండు రోజుల్లో రూ. 3.61 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ రాబట్టిగలిగిందని సమాచారం. ఇక తొలి రోజున ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 1.27 కోట్ల షేర్, రూ. 2.45 గ్రాస్ సాధించగలిగింది. రెండో రోజుతో గ్రాస్ మరింతగా పెరగనుండగా.. బ్రేక్ ఈవెన్ కు రూ. 13 కోట్లు రావాల్సి ఉందని సమాచారం.


Click it and Unblock the Notifications











