Rama Banam Collections: రామబాణం చిత్రానికి మరో దెబ్బ.. 3వ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?
హిట్లు ప్లాపులు అంటూ తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు మ్యాచో హీరో గోపీచంద్. గతేడాది పక్కా కమర్షియల్ సినిమాతో యావరేజ్ టాక్ అందుకున్నాడు. ఈ సంవత్సరం రామ బాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీవాస్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. మే 5న విడుదలైన ఈ సినిమాకు మూడో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.
కీలక పాత్రలు:లక్ష్యం సినిమాలో జగపతి బాబు, గోపీచంద్ అన్నదమ్ముల్లాగా ఆన్ స్క్రీన్ బ్రోమాన్స్ బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు తాజాగా మళ్లీ రామ బాణం సినిమాలో కూడా అదే చూపించారు. డస్కీ బ్యూటి డింపుల్ హయతి హీరోయిన్ గా చేసిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఇందులో సీనియర్ నటి కుష్బూ, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ప్రీ రిలీజ్ బిజినెస్:రామబాణం చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 840 థియేటర్లలో విడుదల చేశారు. అలాగే ఈ సినిమాకు నైజాంలో రూ. 4.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.00 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 12.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 80 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లు కలుపుకుని మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 14.50 కోట్ల బిజినెస్ అయింది.

ఇప్పటికీ వచ్చిన కలెక్షన్స్:ఆర్గానిక్ ఫుడ్ కాన్సెప్ట్ తో వచ్చిన రామబాణం చిత్రం మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.17 కోట్లు, రెండో రోజు రూ. 81 లక్షల షేర్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టగలిగింది. ఇక రెండు రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.98 కోట్ల షేర్, రూ. 3.70 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 2.13 కోట్ల షేర్, రూ. 4.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.

థియేటర్ ఆక్యుపెన్సీ:రామబాణం చిత్రానికి మిక్కి జె మేయర్ సంగీతం అందించారు. ఆయన సంగీతంపై ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. చాలా రకాలుగా ఈ సినిమాకు నెగెటివిటీ వస్తోంది. ఈ క్రమంలో మూడో రోజు అయిన ఆదివారం కూడా ఆక్యుపెన్సీ అంతంతమాత్రంగానే ఉంది. ఉదయం 14.53 శాతం, మధ్యాహ్నం 25.18 శాతం సాయంత్రం 21.22 శాతంగా నమోదు అయింది. ఇలా అయితే సినిమాకు కలెక్షన్ల పరంగా పెద్ద దెబ్బ తగిలేలా ఉంది.

3వ రోజు కలెక్షన్స్:గోపీచంద్ గ్యాంగ్ స్టర్ గా నటించిన తాజా సినిమా రామబాణం సినిమాకు ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. ఫలితంగా కలెక్షన్స్, ఆక్యుపెన్సీ తగ్గిపోతుంది. మొదటి రోజు కంటే రెండో రోజు వసూళ్లు దారుణంగా ఉన్నాయి. ఇక మూడో రోజున రూ. 1.50 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. మొత్తంగా మూడు రోజుల్లో రూ. 5.11 కోట్లు ఇండియా నెట్ కలెక్షన్స్ వసూలు అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











