Bhimaa 2 Days Collections: భీమాకు షాకింగ్ కలెక్షన్లు.. 2 రోజుల్లో ఎంతంటే.. గోపీచంద్ హిట్ కొడతాడా?
టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. అందులో మ్యాచో స్టార్ గోపీచంద్ ఒకడు. సుదీర్ఘ కాలం నుంచి విజయాన్ని అందుకోలేకపోతోన్న అతడు.. వరుసగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ఇలా ఇటీవలే 'భీమా' అనే క్రేజీ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి అనుకున్న విధంగా టాక్ రాకపోవడంతో రెస్పాన్స్ కూడా మోస్తరుగానే వస్తోంది. దీంతో కలెక్షన్లు పర్వాలేదనిపించేలా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోపీచంద్ 'భీమా' మూవీ రెండు రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!
భీమాగా వచ్చేసిన గోపీచంద్:మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'భీమా'. హర్ష తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించారు. ఇందులో ప్రియాంక భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్‌లుగా నటించగా.. వెన్నెల కిశోర్, రఘుబాబు, నాజర్, ముఖేష్ తివారి, నరేష్ తదితరులు కీలక పాత్రలు చేశారు. దీనికి రవి బస్రూర్ సంగీతాన్ని అందించాడు.

భీమా మూవీకి ప్రీ బిజినెస్:గోపీచంద్ నటించిన 'భీమా'కు నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 4.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 9.50 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో రూ. 1.80 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 11.30 కోట్లు బిజినెస్ జరిగింది.
2వ రోజు ఎంత వచ్చింది?:సరైన హిట్ కోసం చాలా కాలం నుంచి వేచి చూస్తోన్న మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన 'భీమా' సినిమాకు మొదటి రోజు అనుకున్న దానికంటే తక్కువ స్పందనే వచ్చింది. ఈ క్రమంలోనే రెండో రోజు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దీనికి డీసెంట్ రెస్పాన్సే వచ్చింది. ఫలితంగా రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలను కలుపుకుని రూ. 1.12 కోట్లు షేర్‌ను వసూలు చేసింది.
2 రోజుల్లో ఎంత వచ్చింది?:ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో పాటు ఫాంటసీ ఎలిమెంట్లతో రూపొందిన 'భీమా' సినిమాకు రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తక్కువ రెస్పాన్స్ లభించింది. ఫలితంగా దీనికి నైజాంలో రూ. 1.16 కోట్లు, సీడెడ్‌లో రూ. 64 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో రూ. 1.40 కోట్లు షేర్ వసూలు అయింది. ఇలా రెండు రోజుల్లో ఈ మూవీకి రూ. 3.20 కోట్లు షేర్, రూ. 5.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:హర్ష దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన 'భీమా' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో రెండు రోజుల్లో రూ. 3.20 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లలో కలిపి రూ. 35 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే రెండు రోజుల్లో ఈ చిత్రానికి రూ. 3.55 కోట్లు షేర్‌తో పాటు రూ. 6.45 కోట్లు గ్రాస్ వచ్చింది.
టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:యాక్షన్ జోనర్‌లో రూపొందిన 'భీమా' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 12.00 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో గోపీచంద్ సినిమాకు రూ. 3.55 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 8.45 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











