Bhimaa 4 Days Collections: భీమాకు ఊహించని వసూళ్లు.. 4 రోజుల్లో వచ్చింది ఎంతంటే!
సాధారణంగా ఏ హీరో అయినా హిట్ అయితేనే ఉత్సాహంతో సినిమాలు చేస్తుంటాడు. కానీ, కొందరు మాత్రం ఫ్లాపులు వస్తున్నా ఏమాత్రం తగ్గకుండా వెళ్తుంటారు. అలాంటి వారిలో మ్యాచో స్టార్ గోపీచంద్ ఒకడు. హిట్ కొట్టి చాలా కాలమే అవుతోన్నా సినిమాలు మాత్రం వరుసగా చేస్తూనే ఉన్నాడు. అలా ఇప్పుడు 'భీమా' అనే మూవీతో వచ్చాడు. దీనికి మిక్స్‌డ్ టాక్ రావడంతో రెస్పాన్స్ ఆశించిన విధంగా రావడం లేదు. ఫలితంగా కలెక్షన్లు కూడా డౌన్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గోపీచంద్ 'భీమా' మూవీ నాలుగు రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!
భీమాగా ఎంటరైన గోపీచంద్
గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీనే 'భీమా'. హర్ష తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించారు. ఇందులో ప్రియాంక భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్‌లుగా నటించగా.. వెన్నెల కిశోర్, రఘుబాబు, నాజర్, ముఖేష్ తివారి, నరేష్ తదితరులు కీలక పాత్రలు చేశారు. దీనికి రవి బస్రూర్ మ్యూజిక్‌ను ఇచ్చాడు.

భీమా మూవీకి ప్రీ బిజినెస్
గోపీచంద్ నటించిన 'భీమా' సినిమాకు నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 4.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 9.50 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో రూ. 1.80 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 11.30 కోట్లు బిజినెస్ అయింది.
4వ రోజు ఎంత వచ్చింది
చాలా కాలంగా భారీ విజయం కోసం ఎదురు చూస్తున్న మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన 'భీమా' సినిమాకు మొదటి రోజు అనుకున్న దానికంటే తక్కువ స్పందనే వచ్చింది. అయినప్పటికీ వీకెండ్‌లో డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. ఇక, 4వ రోజు వర్కింగ్ డే ఉన్నా ఇది బాగానే హోల్డ్ చేసింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 57 లక్షలు షేర్‌ను వసూలు చేసింది.

4 రోజుల్లో ఎంత వచ్చింది
యాక్షన్ అండ్ సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్‌తో రూపొందిన 'భీమా' సినిమాకు 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు రెస్పాన్స్ లభించింది. ఫలితంగా దీనికి నైజాంలో రూ. 1.92 కోట్లు, సీడెడ్‌లో రూ. 81 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో రూ. 2.00 కోట్లు షేర్ వసూలు అయింది. ఇలా 4 రోజుల్లో ఈ మూవీకి రూ. 4.73 కోట్లు షేర్, రూ. 8.15 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత
కన్నడ దర్శకుడు హర్ష రూపకల్పనలో గోపీచంద్ నటించిన 'భీమా' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 4 రోజుల్లో రూ. 4.73 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లలో కలిపి రూ. 50 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 4 రోజుల్లో గోపీచంద్ చిత్రానికి రూ. 5.23 కోట్లు షేర్‌తో పాటు రూ. 9.40 కోట్లు గ్రాస్ వచ్చింది.
టార్గెట్ ఇలా.. ఎంత రావాలి
క్రేజీ యాక్షన్‌తో తెరకెక్కిన 'భీమా' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 12.00 కోట్లుగా నమోదైంది. ఇక, 4 రోజుల్లో గోపీచంద్ సినిమాకు రూ. 5.23 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 6.77 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











