Bhimaa 5 Days Collections: గోపీచంద్ ఊరమాస్.. ఆ మూవీ కంటే ఎక్కువగా.. ఎన్ని కోట్లు వచ్చాయంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలో అతి తక్కువ మంది హీరోలు మాత్రమే సుదీర్ఘ కాలంగా విజయాన్ని అందుకోలేకపోతున్నారు. అందులో మ్యాచో స్టార్ గోపీచంద్ ఒకరు. చాలా ఏళ్లుగా విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తున్నా అతడికి మాత్రం భారీ హిట్ రావడం లేదు.
దీంతో ఈ సారి ఎలాగైనా కొట్టాలన్న కసితో 'భీమా' అనే మూవీతో వచ్చాడు. దీనికి మిక్స్‌డ్ టాక్ రావడంతో వీకెండ్‌లో అంతగా రాణించలేదు. కానీ, వీక్ డేస్‌లో మాత్రం ఇది బాగానే వసూళ్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలో గోపీచంద్ 'భీమా' మూవీ 5 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!

భీమాగా గోపీచంద్ ఊరమాస్
గోపీచంద్ హీరోగా నటించిన ఊరమాస్ సినిమానే 'భీమా'. హర్ష తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించారు. ఇందులో ప్రియాంక భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్‌లుగా నటించగా.. వెన్నెల కిశోర్, రఘుబాబు, నాజర్, ముఖేష్ తివారి, నరేష్ తదితరులు కీలక పాత్రలు చేశారు. దీనికి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చారు.
భీమా మూవీకి ప్రీ బిజినెస్
గోపీచంద్ హీరోగా చేసిన 'భీమా'కు నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 4.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 9.50 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో రూ. 1.80 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 11.30 కోట్లు బిజినెస్ జరిగింది.
5వ రోజు ఎంత వచ్చింది?
సుదీర్ఘ కాలంగా సరైన హిట్ లేకున్నా వరుసగా సినిమాలు చేస్తోన్న గోపీచంద్.. ఇటీవలే 'భీమా' మూవీతో వచ్చాడు. దీనికి వీకెండ్‌లో ఆశించిన భారీ రెస్పాన్స్ రాకున్నా.. వీక్ డేస్‌లో మాత్రం మంచి స్పందనను అందుకుంటోంది. ఇలా 5వ రోజు వర్కింగ్ డే ఉన్నా ఇది బాగానే హోల్డ్ చేసింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 48 లక్షలు షేర్‌ను వసూలు చేసింది.

5 రోజుల్లో ఎంత వచ్చింది?
ఫుల్ లెంగ్త్ యాక్షన్ అండ్ ఫాంటసీ జోనర్‌లో రూపొందిన 'భీమా' సినిమాకు 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు స్పందన లభించింది. ఫలితంగా దీనికి నైజాంలో రూ. 2.08 కోట్లు, సీడెడ్‌లో రూ. 87 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో రూ. 2.26 కోట్లు షేర్ వసూలు అయింది. ఇలా 5 రోజుల్లో ఈ మూవీకి రూ. 5.21 కోట్లు షేర్, రూ. 8.95 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా హర్ష తెరకెక్కించిన 'భీమా' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 5 రోజుల్లో రూ. 5.21 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లలో కలిపి రూ. 54 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 5 రోజుల్లో గోపీచంద్ చిత్రానికి రూ. 5.75 కోట్లు షేర్‌తో పాటు రూ. 10.30 కోట్లు గ్రాస్ వచ్చింది.
టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
డిఫరెంట్ యాక్షన్‌తో తెరకెక్కిన 'భీమా' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 12.00 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో గోపీచంద్ సినిమాకు రూ. 5.75 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 6.25 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











