Bhimaa 6 Days Collections: టాక్‌ ఒకలా వసూళ్లు మరోలా.. 6 రోజుల్లో గోపీచంద్ ఎంత రాబట్టాడంటే!

యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌తో తెలుగు చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా తనదైన మార్కును చూపిస్తూ ముందుకు సాగుతోన్నాడు మ్యాచో స్టార్ గోపీచంద్. అయితే, ఆశించిన రీతిలో హిట్లను మాత్రం అతడు అందుకోవడం లేదు. అయినా వరుసగా మూవీలు చేస్తూనే ఉన్నాడు.

ఇలా ఇటీవలే గోపీచంద్ 'భీమా' అనే మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. దీనికి మిక్స్‌డ్ టాక్ రావడంతో వీకెండ్‌లో అంతగా రాణించలేదు. కానీ, వీక్ డేస్‌లో మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలో గోపీచంద్ 'భీమా' మూవీ 6 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే లుక్కేయండి!

Gopichand Starrer Bhimaa Movie 6 Days Worldwide Collections

భీమాగా గోపీచంద్ అరాచకం
గోపీచంద్ హీరోగా నటించిన క్రేజీ యాక్షన్ మూవీనే 'భీమా'. హర్ష తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించారు. దీనికి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చారు. ఇందులో ప్రియాంక భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్‌లుగా నటించగా.. వెన్నెల కిశోర్, రఘుబాబు, నాజర్, ముఖేష్ తివారి, నరేష్ తదితరులు కీలక పాత్రలు చేశారు.

భీమా మూవీకి ప్రీ బిజినెస్

గోపీచంద్ నటించిన 'భీమా'కు నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 4.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 9.50 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో రూ. 1.80 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 11.30 కోట్లు బిజినెస్ అయింది.

Gopichand Starrer Bhimaa Movie 6 Days Worldwide Collections

6వ రోజు ఎంత వచ్చింది?
హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న గోపీచంద్ నటించిన 'భీమా' మూవీ వీక్ డేస్‌లో కూడా మంచి ప్రదర్శన చేస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా ఈ సినిమా మంచి రెస్పాన్స్‌తో సత్తా చాటుతోంది. ఇలా 6వ రోజు 5వ రోజుతో సమానంగా హోల్ట్ చేయగలిగింది. ఫలితంగా దీనికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 45 లక్షలు షేర్‌ను వసూలు చేసింది.

6 రోజుల్లో ఎంత వచ్చింది?

యాక్షన్ స్టోరీకి ఫాంటసీ ఎలిమెంట్స్ జోడించి తీసిన 'భీమా' సినిమాకు 6 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు స్పందన లభించింది. ఫలితంగా దీనికి నైజాంలో రూ. 2.28 కోట్లు, సీడెడ్‌లో రూ. 92 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో రూ. 2.46 కోట్లు షేర్ వసూలు అయింది. ఇలా 6 రోజుల్లో ఈ మూవీకి రూ. 5.66 కోట్లు షేర్, రూ. 9.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

Gopichand Starrer Bhimaa Movie 6 Days Worldwide Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా హర్ష రూపొందించిన 'భీమా' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 6 రోజుల్లో రూ. 5.66 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లలో కలిపి రూ. 59 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 6 రోజుల్లో గోపీచంద్ చిత్రానికి రూ. 6.25 కోట్లు షేర్‌తో పాటు రూ. 11.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

Gopichand Starrer Bhimaa Movie 6 Days Worldwide Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?

ఓ రేంజ్ యాక్షన్‌తో తెరకెక్కిన 'భీమా' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 12.00 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లో గోపీచంద్ సినిమాకు రూ. 6.25 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 5.75 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X