Bhimaa 7 Days Collections: 12 కోట్లు వస్తేనే హిట్.. భీమాకు వారంలో షాకింగ్‌గా.. గోపీచంద్ హిట్ కొడతాడా!
తెలుగు చిత్ర పరిశ్రమలో కొంత మంది హీరోలు మాత్రమే చాలా తక్కువ హిట్లు వచ్చినా.. వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో మ్యాచో స్టార్ గోపీచంద్ ఒకడు. ఈ మధ్య కాలంలో భారీ హిట్ కోసం ఈ టాలెంటెడ్ హీరో ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడు. అలా ఇటీవలే 'భీమా' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి మిక్స్‌డ్ టాక్ రావడంతో వీకెండ్‌లో అంతగా రాణించలేదు. కానీ, వీక్ డేస్‌లో మంచి వసూళ్లు తీసుకొస్తూ సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో గోపీచంద్ 'భీమా' మూవీ 7 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!
భీమాగా గోపీచంద్ ఎంటర్
గోపీచంద్ హీరోగా నటించిన యాక్షన్ సినిమానే 'భీమా'. హర్ష తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించారు. దీనికి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చారు. ఇందులో ప్రియాంక భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్‌లుగా నటించగా.. వెన్నెల కిశోర్, రఘుబాబు, నాజర్, ముఖేష్ తివారి, నరేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

భీమా మూవీకి ప్రీ బిజినెస్
మ్యాచో స్టార్ గోపీచంద్ 'భీమా'కు నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 4.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 9.50 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో రూ. 1.80 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 11.30 కోట్లు బిజినెస్ జరిగింది.
7వ రోజు ఇలా.. మొత్తంగా
సరైన హిట్ కోసం వేచి చూస్తున్న గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ 'భీమా'కు వీక్ డేస్‌లో కూడా మంచి స్పందన వస్తోంది. అలా ఏడో రోజు ఈ చిత్రం అదిరిపోయే హోల్డునే చూపించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో దీనికి రూ. 40 లక్షలు షేర్ వచ్చింది. వరల్డ్ వైడ్‌గా రూ. 45 లక్షలు వసూలు అయ్యాయి. ఇలా ఇప్పటి వరకూ ఈ మూవీ రూ. 6.70 కోట్లు షేర్‌ను కలెక్ట్ చేసుకుంది.


Click it and Unblock the Notifications











