Bhimaa 8 Days Collections: ఆ మూవీ కంటే డబుల్.. కుమ్మేస్తున్న గోపీచంద్.. హిట్ అవ్వాలంటే మాత్రం!
టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకరిద్దరు మాత్రం సుదీర్ఘ కాలంగా విజయాలను అందుకోవట్లేదు. అలాంటి వారిలో మ్యాచో స్టార్ గోపీచంద్ ఒకడు. భారీ విజయం కోసం వేచి చూస్తున్న ఈ టాలెంటెడ్ హీరో ఇటీవలే 'భీమా' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి మిక్స్‌డ్ టాక్ రావడంతో వీకెండ్‌లో అంతగా రాణించలేదు. కానీ, వీక్ డేస్‌లో మంచి వసూళ్లను రాబడుతూ సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో గోపీచంద్ 'భీమా' మూవీ 8 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో మీరే చూడండి!
భీమాగా వచ్చేసిన గోపీచంద్
గోపీచంద్ హీరోగా నటించిన క్రేజీ మూవీనే 'భీమా'. హర్ష తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించారు. దీనికి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చారు. ఇందులో ప్రియాంక భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్‌లుగా నటించగా.. వెన్నెల కిశోర్, రఘుబాబు, నాజర్, ముఖేష్ తివారి, నరేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

భీమా మూవీకి ప్రీ బిజినెస్
గోపీచంద్ నటించిన 'భీమా'కు నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 4.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 9.50 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో రూ. 1.80 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 11.30 కోట్లు బిజినెస్ అయింది.
8వ రోజు ఎంత వచ్చింది?
సుదీర్ఘ కాలంగా ఏకధాటిగా సినిమాలు చేస్తోన్న గోపీచంద్.. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో చేసిన 'భీమా' మూవీ వీక్ డేస్‌లో కూడా మంచి ప్రదర్శన చేస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా ఈ సినిమా మంచి రెస్పాన్స్‌తో సత్తా చాటుతోంది. ఇలా 8వ రోజు కూడా హోల్ట్ చేయగలిగింది. ఫలితంగా దీనికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 38 లక్షలు షేర్‌ను వసూలు చేసింది.

8 రోజుల్లో ఎంత వచ్చింది?
యాక్షన్, ఫాంటసీ అంశాలతో రూపొందిన 'భీమా' సినిమాకు 8 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విధంగా మోస్తరు స్పందన లభించింది. ఫలితంగా దీనికి నైజాంలో రూ. 2.58 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.07 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో రూ. 2.79 కోట్లు షేర్ వసూలు అయింది. ఇలా 8 రోజుల్లో ఈ మూవీకి రూ. 6.44 కోట్లు షేర్, రూ. 11.00 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా హర్ష తెరకెక్కించిన 'భీమా' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 8 రోజుల్లో రూ. 6.44 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లలో కలిపి రూ. 65 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 8 రోజుల్లో గోపీచంద్ చిత్రానికి రూ. 7.09 కోట్లు షేర్‌తో పాటు రూ. 12.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
డిఫరెంట్ యాక్షన్‌తో తెరకెక్కిన 'భీమా' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 12.00 కోట్లుగా నమోదైంది. ఇక, 8 రోజుల్లో గోపీచంద్ సినిమాకు రూ. 7.09 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 4.91 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











