Bhimaa Business: హిట్ లేకున్నా గట్టిగానే భీమా బిజినెస్.. గోపీచంద్ మూవీకి ఎన్ని కోట్లు రావాలంటే!

టాలెంట్ ఉన్నా తెలుగు చిత్ర పరిశ్రమలో విజయాలను అందుకోలేక ఇబ్బందులు పడుతున్న హీరోల్లో మ్యాచో స్టార్ గోపీచంద్ ఒకడు. కెరీర్ ఆరంభంలో పలు హిట్లను ఖాతాలో వేసుకున్నా.. ఈ మధ్య కాలంలో మాత్రం సరైన సక్సెస్‌ను సొంతం చేసుకోవడం లేదు. అయినా వరుసగా మూవీలు చేస్తూనే వెళ్తున్నాడు.

ఈ క్రమంలోనే ఇప్పుడు గోపీచంద్ 'భీమా' అనే ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీలో నటించాడు. క్రేజీ కాంబోలో రూపొందిన ఈ చిత్రం మార్చి 8వ తేదీన విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను మీరే చూసేయండి!

Gopichand Starrer Bhimaa Movie Pre Release Business Details

భీమాతో వస్తున్న గోపీచంద్: గోపీచంద్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'భీమా'. హర్ష తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించారు. ఇందులో ప్రియాంక భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్‌లుగా నటించగా.. వెన్నెల కిశోర్, రఘుబాబు, నాజర్, ముఖేష్ తివారి, నరేష్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చాడు.

Gopichand Starrer Bhimaa Movie Pre Release Business Details

అలాంటి స్టోరీ.. కమర్షియల్‌: ఓ పవర్‌ఫుల్ పోలీస్ కథకు ఫాంటసీ ఎలిమెంట్లు జోడించి తెరకెక్కించిన చిత్రమే 'భీమా'. లవ్, ఎమోషన్స్, డ్రామా, యాక్షన్ వంటి అంశాలను జోడించి తెరకెక్కించిన ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్లకు భారీ రెస్పాన్స్ రావడంతో దీనిపై అంచనాలు పెరిగాయి. ఫలితంగా ఈ పక్కా కమర్షియల్ చిత్రం మార్చి 8వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.

Gopichand Starrer Bhimaa Movie Pre Release Business Details

ప్రమోషన్స్.. ఫుల్ సందడిగా: గోపీచంద్ - హర్ష కాంబినేషన్‌లో రూపొందిన ఈ మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇప్పటికే చాలా ఈవెంట్లు చేసింది. అలాగే, ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూలు కూడా చేసుకున్నారు. ఇక, గురువారం సాయంత్రమే అమెరికాలో ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. దీంతో ఈ సినిమా సందడి పెరుగుతోంది.

హక్కులకు మంచి డిమాండ్: ఈ మధ్య కాలంలో హిట్లు కొట్టకున్నా గోపీచంద్ నటించిన 'భీమా' మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైనా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ నెలకొంది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల రైట్స్ మంచి ధరలకే అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాలు చెప్పాయి.

Gopichand Starrer Bhimaa Movie Pre Release Business Details

ఏపీ, తెలంగాణలో బిజినెస్: మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన 'భీమా' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. ఈ సినిమా నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 4.50 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుంది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలిసి దీనికి రూ. 9.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

వరల్డ్ వైడ్ బిజినెస్ ఇలా: 'భీమా' మూవీకి ఆరంభంలోనే మంచి హైప్ ఏర్పడింది. దీంతో ఈ సినిమా హక్కులు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ ఏరియాల హక్కులు రూ. 1.80 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.30 కోట్లు వ్యాపారం జరిగింది. అంటే గోపీచంద్ సినిమా హిట్ అవ్వాలంటే మాత్రం రూ. 12 కోట్లు షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది.

Gopichand Starrer Bhimaa Movie Pre Release Business Details

హిట్ లేకున్నా గట్టిగానే: హర్ష దర్శకత్వంలో గోపీచంద్ నటించిన 'భీమా' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.30 కోట్లు బిజినెస్ జరిగింది. తద్వారా ఈ మధ్య కాలంలో అతడి నుంచి వచ్చిన చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభావాన్ని చూపించింది. ఇటీవలి కాలంలో హిట్ లేకున్నా మంచి బిజినెస్‌నే ఇది జరుపుకుంది. ఫలితంగా అతడి గత 5 చిత్రాల్లో నాలుగో స్థానంలో నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X