Ramabanam Collections: గోపీచంద్‌కు ఘోర పరాభవం.. వారంలోనే రామబాణం ఔట్.. అన్ని కోట్ల నష్టాల దిశగా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా తనదైన రీతిలో సత్తా చాటుతూ వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్నాడు మ్యాచో స్టార్ గోపీచంద్. అయితే, కెరీర్ ఆరంభంలో చాలా హిట్లను సొంతం చేసుకున్న అతడు.. చాలా కాలంగా సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి ప్రయత్నాలు చేస్తోన్నాడు. కానీ, ఇవి విఫలం అవుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లోనే గత వారమే గోపీచంద్ 'రామబాణం' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ రావడంతో కలెక్షన్లు పడిపోతూనే ఉన్నాయి. మరి 'రామబాణం' ఫస్ట్ వీక్‌ వసూళ్లపై మీరే లుక్కేయండి మరి!

రామబాణం అంటూ వచ్చేశాడు:మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా శ్రీవాస్ తెరకెక్కించిన చిత్రమే 'రామబాణం'. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇందులో డింపుల్ హయాతి హీరోయిన్‌గా నటించగా.. జగపతి బాబు, కుస్భూ సుందర్, తరుణ్ రాజ్, నాజర్, సచిన్ ఖేడ్కర్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు.

Gopichand Starrer Ramabanam Movie 1st Week Worldwide Official Collections

రామబాణం బిజినెస్ వివరాలివే:గోపీచంద్ 'రామబాణం' మూవీకి నైజాంలో రూ. 4.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.00 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 12.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 80 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.50 కోట్ల బిజినెస్‌ను జరుపుకుంది.

Gopichand Starrer Ramabanam Movie 1st Week Worldwide Official Collections

ఏడో రోజు తెలుగులో ఎంతంటే:
గోపీచంద్ - డింపుల్ హయాతి జంటగా నటించిన 'రామబాణం' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్పందన రావట్లేదు. ఫలితంగా కలెక్షన్లు చాలా దారుణంగా పడిపోతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీ ఆరో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 13 లక్షలు షేర్ అందుకోగా.. ఏడో రోజు రూ. 10 లక్షలే వసూలు చేసింది.

Gopichand Starrer Ramabanam Movie 1st Week Worldwide Official Collections

వారంలో ఎక్కడ? ఎంతొచ్చింది?:'రామబాణం' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో ఫస్ట్ వీక్‌లో మోస్తరు రెస్పాన్సే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.10 కోట్లు, సీడెడ్‌లో రూ. 54 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 43 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 33 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, గుంటూరులో రూ. 27 లక్షలు, కృష్ణాలో రూ. 29 లక్షలు, నెల్లూరులో రూ. 16 లక్షలతో.. రూ. 3.31 కోట్లు షేర్, రూ. 6.80 కోట్లు గ్రాస్ దక్కింది.

Gopichand Starrer Ramabanam Movie 1st Week Worldwide Official Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది:
ఆంధ్రా, తెలంగాణలో వారంలో రూ. 3.31 కోట్లు మాత్రమే వసూలు చేసిన గోపీచంద్ 'రామబాణం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశనే ఎదుర్కొందని చెప్పాలి. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లలో కలిపి ఈ సినిమా కేవలం రూ. 17 లక్షలే రాబట్టింది. ఇలా ఇది ప్రపంచ వ్యాప్తంగా మొదటి వారం రూ. 3.48 కోట్లు షేర్‌, రూ. 7.55 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

Gopichand Starrer Ramabanam Movie 1st Week Worldwide Official Collections

మూవీకి టార్గెట్.. ఎంత రావాలి?:ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'రామబాణం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 15.20 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి వారం దీనికి రూ. 3.48 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 11.72 కోట్లు వస్తేనే హిట్ అవుతుంది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడంలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X