Ramabanam Day 1 Collections: రామబాణంకు షాకింగ్ కలెక్షన్లు.. తొలి రోజే ఘోరం.. ఇంకెంత రావాలో తెలిస్తే!
టాలీవుడ్‌లో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో మ్యాచో స్టార్ గోపీచంద్ ఒకడు. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు.. కొంత కాలంగా సరైన సక్సెస్‌ను అందుకోవడం లేదు. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుసగా సినిమాలు చేస్తోన్నాడు.
ఈ క్రమంలోనే ఇప్పుడు 'రామబాణం' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు పెద్దగా రాలేదు. మరి 'రామబాణం' మొదటి రోజు వసూళ్లపై మీరే లుక్కేయండి మరి!

రామబాణంతో వచ్చిన గోపీచంద్: గోపీచంద్ హీరోగా శ్రీవాస్ తెరకెక్కించిన తాజా చిత్రమే 'రామబాణం'. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇందులో డింపుల్ హయాతి హీరోయిన్‌గా నటించగా.. జగపతి బాబు, కుస్భూ సుందర్, తరుణ్ రాజ్, నాజర్, సచిన్ ఖేడ్కర్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు.

రామబాణం బిజినెస్ వివరాలివే: గోపీచంద్ నటించిన 'రామబాణం' మూవీకి నైజాంలో రూ. 4.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.00 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 12.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 80 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.50 కోట్ల బిజినెస్ చేసుకుంది.

అలాంటి టాక్.. భారీ కలెక్షన్లు: ఎన్నో అంచనాల నడుమ విడుదలైన గోపీచంద్ 'రామబాణం' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ ఓ మోస్తరుగానే వచ్చింది. దీంతో ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఓపెనింగ్ డేన తక్కువ కలెక్షన్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అందుకు తగ్గట్లే వసూళ్లు సోసోగానే వచ్చాయి.
తొలి రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?: 'రామబాణం' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో ఫస్ట్ డే మోస్తరు రెస్పాన్సే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 46 లక్షలు, సీడెడ్‌లో రూ. 21 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 14 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో కలిపి.. రూ. 1.17 కోట్లు షేర్, రూ. 2.20 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: ఆంధ్రా, తెలంగాణలో షాకింగ్‌గా రూ. 1.17 కోట్లు మాత్రమే వసూలు చేసిన గోపీచంద్ 'రామబాణం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశనే ఎదుర్కొందని చెప్పాలి. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లలో కలిపి ఈ సినిమా కేవలం రూ. 10 లక్షలే రాబట్టింది. ఇలా ఇది ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజే రూ. 1.27 కోట్లు షేర్, రూ. 2.45 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.
మూవీకి టార్గెట్.. ఎంత రావాలి?: ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'రామబాణం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 15.20 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 1.27 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 13.93 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

తొలి రోజే ఇంత తక్కువగానా?: పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంగా వచ్చిన 'రామబాణం'కు ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ రావడం పెద్ద మైనస్‌గా మారిపోయింది. దీంతో ఈ సినిమాకు తొలి రోజు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ఫలితంగా ఈ మూవీ చాలా తక్కువ వసూళ్లనే కలెక్ట్ చేసింది. ఈ మధ్య కాలంలో గోపీచంద్ సినిమాల్లో ఇది చాలా తక్కువ మొత్తం అనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











