Ramabanam Day 2 Collections: గోపిచంద్ సినిమాకు పెద్ద దెబ్బె.. పరిస్థితి ఎలా ఉందంటే?
మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న గోపీచంద్ ఎలాగైనా ఈసారి రామబాణం సినిమాతో మంచి సక్సెస్ అందుకోవాలి అని అనుకుంటున్నాడు. అయితే ఈ సినిమా మాత్రం మొదటి రోజే ఊహించని విధంగా యావరేజ్ టాక్ అందుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఏమాత్రం ఆశించినంత స్థాయిలో అయితే రావడం లేదు.
ఇక మొదటి రోజు దారుణమైన కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమా రెండవ రోజు కూడా పెద్దగా నెంబర్స్ ఏమి పెంచుకోలేకపోయింది. ఇక మొత్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్దనే నష్టాలు ఎదుర్కునే అవకాశం ఉన్నట్లుగా అనిపిస్తోంది. మొత్తంగా ఈ సినిమా రెండు రోజుల్లో ఎంతవరకు కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే...

రామబాణం ప్రీ రిలీజ్ బిజినెస్: శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన 'రామబాణం' సినిమా డిమాండ్ కు తగ్గ బిజినెస్ చేసింది. ఏరియాల వారిగా సినిమా బిజినెస్ వివరాల్లోకి వెళితే.. నైజాంలో రూ. 4.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.00 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఇలా ఏపీ తెలంగాణలో రూ. 12.50 కోట్ల బిజినెస్, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 80 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.50 కోట్ల బిజినెస్ చేసుకుంది.

షాకింగ్ రెస్పాన్స్: రామబాణం సినిమా ట్రైలర్ తో పాటు అంతకు ముందుకు వచ్చిన టీజర్ పోస్టర్స్ కూడా సినిమాపై ప్రేక్షకులలో కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేశాయి. అంతేకాకుండా గోపీచంద్ ఈ దర్శకుడితో చేసిన లక్ష్యం లౌక్యం రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ప్రాఫిట్స్ అందించాయి. కాబట్టి ఈసారి తప్పకుండా ఈ కాంబినేషన్లో సక్సెస్ పడుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ సినిమాకు పబ్లిక్ టాక్ అలాగే రివ్యూల పరంగా కూడా ఏమాత్రం పాజిటివ్ రెస్పాన్స్ అయితే రాలేదు.

2వ రోజు వచ్చిన కలెక్షన్స్: 'రామబాణం' సినిమాకు అనుకున్నంతగా పాజిటివ్ టామ్ ఏమి రాలేదు. ఇక ఆంధ్రా, తెలంగాణలో ఫస్ట్ డే మోస్తరు రెస్పాన్సే వచ్చింది. రెండవ రోజు ఆ ప్రభావం గట్టిగానే పడింది. నైజాంలో రూ. 30 లక్షలు, సీడెడ్‌లో రూ. 21 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 14 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో కలిపి.. రూ. 90 లక్షల షేర్, రూ. 1.40 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్: ఆంధ్రా, తెలంగాణలో షాకింగ్‌గా మొదటి రోజు రూ. 1.17 కోట్లు మాత్రమే వసూలు ఈ సినిమా. రెండవ రోజు ఇంకాస్త తక్కువగా రాబట్టింది... కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లలో కలిపి ఈ సినిమా కేవలం రూ. 10 లక్షలే రాబట్టింది. ఇలా ఇది ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో 1.90 కోట్లు షేర్, రూ. 3.20 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

ఇంకా ఎంత రావాలంటే: ఆర్గానిక్ ఫుడ్ కాన్సెప్ట్ ను టచ్ చేస్తూ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'రామబాణం' సినిమా అంచనాలకు తగ్గట్టుగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 15.20 కోట్లుగా నమోదైంది. రెండు రోజుల్లో రోజు దీనికి రూ. దాదాపు 2 కోట్లు షేర్ రాగా.. మరో రూ. 12 కోట్లు రాబడితేనే ఈ మూవీ సక్సెస్ అయినట్లు లెక్క.


Click it and Unblock the Notifications











