Ramabanam Day 3 Collections: వీకెండ్ లో మరింత దారుణమైన కలెక్షన్స్.. ఆ స్థాయిలో నష్టాలు తప్పవా?
మాస్ హీరోగా తన స్థాయిని మరో లెవల్ కు పెంచుకోవాలి అని చూస్తున్నా గోపీచంద్ ఈసారి రామబాణం సినిమాతో తప్పకుండా సక్సెస్ అందుకుంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా ఊహించిన విధంగా నెగిటివ్ టాక్ అందుకోవడంతో కలెక్షన్స్ మొదటి రోజే చాలా తక్కువగా వచ్చాయి. ఇక రెండవ రోజు కూడా పెద్దగా పరిస్థితి ఏమి మారలేదు. మూడవ రోజు అయితే మరింత తక్కువగా రావడంతో సినిమా ఫైనల్ రిజల్ట్ పై తొందరగానే క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమా మొత్తంగా మూడో రోజు ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది. పెట్టిన పెట్టుబడి వెనక్కి రావాలి అంటే ఇంకా ఎంత రావాలి అని వివరాలకు వెళ్తే..
ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు: లక్ష్యం, లౌక్యం సినిమాల అనంతరం శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన 'రామబాణం' సినిమాపై ముందుగానే మంచి బజ్ ఏర్పడటం వలన డిమాండ్ కు తగ్గ బిజినెస్ చేసింది. ఏరియాల వారిగా సినిమా బిజినెస్ వివరాల్లోకి వెళితే.. నైజాంలో రూ. 4.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.00 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఇలా ఏపీ తెలంగాణలో రూ. 12.50 కోట్ల బిజినెస్, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 80 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.50 కోట్ల బిజినెస్ చేసుకుంది.

నెగెటివ్ రివ్యూలు.. షాకింగ్ రెస్పాన్స్: రామబాణం సినిమా ట్రైలర్ ద్వారా అలాగే టీజర్ పోస్టర్స్ తో కూడా సినిమాపై కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేశాయి. కాబట్టి ఈసారి తప్పకుండా ఈ కాంబినేషన్లో సక్సెస్ పడుతుంది అని గోపిచంద్ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ సినిమాకు రివ్యూలు నెగిటివ్ గా వచ్చాయి. అలాగే పబ్లిక్ టాక్ ద్వారా సినిమా రిజల్ట్ ఏమిటనేది మొదట్లోనే క్లారిటీ వచ్చేసింది.

3వ రోజు వచ్చిన కలెక్షన్స్: 'రామబాణం' సినిమాకు పెద్దగా, పాజిటివ్ టామ్ ఏమి రాలేదు. ఇక ఆంధ్రా, తెలంగాణలో ఫస్ట్ డే చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. 3వ రోజు ఆ ప్రభావం గట్టిగానే పడింది. నైజాంలో రూ. 30 లక్షలు, సీడెడ్‌లో రూ. 21 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 14 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో కలిపి.. రూ. 65 లక్షల షేర్, రూ. 1.02 కోట్లు గ్రాస్ దక్కింది.
కలెక్షన్స్: రెండు తెలుగు రాష్ట్రాల్లో రామబాణం సినిమా మొదటి రోజు రూ. 1.17 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక రెండవ రోజు అంతకంటే తక్కువగా 81 లక్షలు మాత్రమే వచ్చాయి. ఈ సినిమా. రెండవ రోజు ఇంకాస్త తక్కువగా రాబట్టింది... కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లలో కలిపి ఈ సినిమా కేవలం రూ. 8 లక్షలే రాబట్టింది. ఇలా సినిమా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో 1.90 కోట్లు షేర్, రూ. 3.20 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

ఇంకా ఎంత వెనక్కి రావాలంటే..: ఆర్గానిక్ ఫుడ్ కాన్సెప్ట్ ను టచ్ చేస్తూ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'రామబాణం' సినిమా అంచనాలకు తగ్గట్టుగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 15.20 కోట్లుగా నమోదైంది. ఇక ముందు రోజుల్లో రామబాణం సినిమా రూ.2.13 కోట్లు షేర్ రాగా.. మరో రూ. 12.50కోట్లు రాబడితేనే ఈ మూవీ సక్సెస్ అయినట్లు లెక్క.


Click it and Unblock the Notifications











