Ramabanam Day 4 Collections: గోపిచంద్ బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా రామబాణం.. సగం కూడా వెనక్కి రాలే..
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న గోపీచంద్ ఈసారి రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అందుకుని తన మార్కెట్ స్థాయిని కూడా పెంచుకోవాలని అనుకున్నాడు. కానీ సినిమా మాత్రం ఊహించిన విధంగా నెగిటివ్ టాక్ అందుకోవడంతో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ఈ సినిమా మొదటి రోజు చాలా తక్కువ కలెక్షన్స్ అందుకుంది. వీకెండ్ లో సినిమా రిజల్ట్ పై ఫైనల్ క్లారిటీ వచ్చేసింది. ఇక సోమవారం నుంచి మరింత తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా నాలుగవ రోజు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాల్లోకి వెళితే..
సినిమా బిజినెస్ వివరాలు:శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన మూడవ సినిమా 'రామబాణం'. ఈ సినిమాపై ముందుగానే మంచి బజ్ ఏర్పడటంతో డిమాండ్ కు తగ్గ బిజినెస్ చేసింది. ఏరియాల వారిగా చూసుకుంటే.. నైజాంలో రూ. 4.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.00 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఇలా ఏపీ తెలంగాణలో రూ. 12.50 కోట్ల బిజినెస్, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 80 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.50 కోట్ల బిజినెస్ చేసుకుంది.

తగ్గుతూ వచ్చిన కలెక్షన్స్:రామబాణం సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంగా కనిపించింది. అయితే ఈ సినిమా కంటెంట్ ఆడియన్స్ కు ఏ మాత్రం కనెక్ట్ కాలేకపోయింది. దీంతో మొదటి రోజు ఈ సినిమాకు కూడా 1.17 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక తర్వాత రోజు కేవలం 81 లక్షలు మాత్రమే రాగా మూడవరోజు 65 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. రోజురోజుకు ఈ సినిమా కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి.

4వ రోజు వచ్చిన కలెక్షన్స్:'రామబాణం' సినిమాకు మరీ ఇంత తక్కువగా కలెక్షన్స్ వస్తాయని ఎవరు ఊహించలేదు. ఆంధ్రా, తెలంగాణలో ఫస్ట్ డే చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. 4వ రోజు ఆ ప్రభావం గట్టిగానే పడింది. నైజాంలో రూ. 5 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి.. రూ. 15 లక్షల షేర్, రూ. 50 లక్షల గ్రాస్ దక్కింది.
4 రోజుల్లో నైజాం ఏపీ కలెక్షన్స్:ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో రామబాణం సినిమా మొదటి రోజు రూ. 1.17 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక రెండవ రోజు అంతకంటే తక్కువగా 81 లక్షలు మాత్రమే వచ్చాయి. ఈ సినిమా మూడవ రోజు ఇంకాస్త తక్కువగా 65 లక్షల గ్రాస్ మాత్రమే అందుకుంది. ఇక 4వ రోజు అంతకంటే తక్కువగా 15 లక్షల రేంజ్ లో రాగా.. మొత్తంగా తెలుగు స్టేట్స్ లో ఈ సినిమా 2.78 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్నట్లు టాక్.

ప్రపంచవ్యాప్తంగా వచ్చిన టోటల్ :రామబాణం సినిమా ఏపి నైజాం లో దాదాపు 2.78 కోట్ల షేర్ అందుకోగా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లలో కలిపి ఈ సినిమా కేవలం రూ. 16 లక్షలే రాబట్టింది. ఇలా సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల్లో 2.79 కోట్లు షేర్, రూ. 5.75 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఎక్కడ కూడా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ లో సగం కూడా వెనక్కి తీసుకు రాలేదు.

గోపిచంద్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్:ఇంతకుముందు గోపిచంద్ ఎలాంటి మాస్ సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ కలెక్షన్స్ వచ్చేవి. కానీ 'రామబాణం' సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఆడలేదు. ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 15.20 కోట్లుగా నమోదైంది. 4 రోజుల్లో రామబాణం సినిమా రూ.2.78 కోట్లు షేర్ రాగా.. మరో రూ. 12 కోట్లు రాబడితేనే ఈ మూవీ సక్సెస్ అయినట్లు లెక్క. కానీ వీకెండ్ లోనే సినిమాకు కలెక్షన్స్ ఏమాత్రం పాజిటివ్ గా రాలేదు. ఫైనల్ గా సినిమా గోపిచంద్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నీలవబోతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











