Ramabanam Day 5 Collections: ఇంత దారుణంగా ఉంటుందని ఊహించి ఉండరు.. ఎంత నష్టం అంటే..
మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్న గోపీచంద్ చాలా కాలంగా సక్సెస్ లేక సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈసారి ఎలాగైనా అతను అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలి అని రామబాణం అనే సినిమాతో వచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకుంది.
గతంలో కంటే గోపీచంద్ ఈ సినిమాతో చాలా తక్కువ స్థాయిలో ఒపెనింగ్స్ అందుకున్నాడు. ఇక సినిమాకు 5వ రోజు మరింత దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి. రామబాణం భారీ స్థాయిలో నష్టాలు కలిగించే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. మొత్తం 5 రోజుల్లో సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే..

ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు:శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ ఇంతకుముందు లౌక్యం లక్ష్యం సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక ఈసారి 'రామబాణం' సినిమాతో మరో మంచి సక్సెస్ అందుకోవాలి అనుకున్నారు. బజ్ ఏర్పడటంతో డిమాండ్ కు తగ్గ బిజినెస్ చేసింది.
ఏరియాల వారిగా చూసుకుంటే.. నైజాంలో రూ. 4.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.00 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఇలా ఏపీ తెలంగాణలో రూ. 12.50 కోట్ల బిజినెస్, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 80 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.50 కోట్ల బిజినెస్ చేసుకుంది.
మొదట్లోనే తక్కువ కలెక్షన్స్:రామబాణం సినిమా మొదటి రోజే నెగిటివ్ టాక్ వలన చాలా తక్కువ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంగా కనిపించింది. ఇక ఈ సినిమా కంటెంట్ ఆడియన్స్ కు ఏ మాత్రం కనెక్ట్ కాలేకపోయింది. ఫస్ట్ డే సినిమాకు 1.17 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక తర్వాత రోజు కేవలం 81 లక్షలు మాత్రమే రాగా మూడవరోజు 65 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక 4వ రోజు 29 లక్షలు రాగా 5వ రోజు అయితే 10 లక్షలకు పడిపోయినట్లు తెలుస్తోంది.

5వ రోజు వచ్చిన కలెక్షన్స్:'రామబాణం' సినిమాకు ఆంధ్రా, తెలంగాణలో ఫస్ట్ డే చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. 5వ రోజు ఆ ప్రభావం గట్టిగానే పడింది. నైజాంలో రూ. 3 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1 లక్ష, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 10 లక్షల షేర్, రూ. 18 లక్షల గ్రాస్ దక్కింది.

5 రోజుల్లో నైజాం ఏపీ కలెక్షన్స్:ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తంగా 5 రోజుల్లో రామబాణం సినిమా ఏరియాల వారిగా అందుకున్న కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాం 1.01 కోట్లు, సీడెడ్ 49 లక్షలు, ఉత్తరాంధ్ర 39 లక్షలు, వెస్ట్ 16 లక్షలు, ఈస్ట్ 28 లక్షలు, గుంటూరులో 22 లక్షలు, కృష్ణలో 24 లక్షలు, నెల్లూరులో 13 లక్షలు, ఆంద్రప్రదేశ్ తెలంగాణలో 2.92 కోట్లు షేర్, 5.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

వరల్డ్ వైడ్ టోటల్ :రామబాణం సినిమా ఏపి నైజాం లో మొత్తంగా 2.92 కోట్ల షేర్ అందుకోగా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లలో కలిపి ఈ సినిమా కేవలం రూ. 17 లక్షలే రాబట్టింది. ఇలా సినిమా ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల్లో 3.09 కోట్లు షేర్, రూ. 6.45 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఎక్కడ కూడా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ లో సగం కూడా వెనక్కి తీసుకు రాలేదు.

ఆ స్థాయిలో నష్టాలు తప్పేలా లేవు:గోపిచంద్ కు మాస్ ఆడియెన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఆ క్రేజ్ వలన ఎలాంటి సినిమా చేసినా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ కలెక్షన్స్ వచ్చేవి. కానీ 'రామబాణం' సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఆడలేదు. ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 15.20 కోట్లుగా నమోదైంది.
5 రోజుల్లో రామబాణం సినిమా రూ.3.09 కోట్లు షేర్ రాగా.. మరో రూ. 12 కోట్లు రాబడితేనే ఈ మూవీ సక్సెస్ అయినట్లు లెక్క. కానీ సినిమాకు ఆ బ్యాలెన్స్ వెనక్కి వచ్చేలా లేవు. దాదాపు 11.50 కోట్ల రేంజ్ లో నష్టాలు రావచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











