Ramabanam Business: రామబాణంకు షాకింగ్ బిజినెస్.. థియేటర్ల మాత్రం వందల్లో.. గోపీచంద్ హిట్ కొట్టాలంటే!

హీరోగా వచ్చి చాలా కాలమే అవుతోన్నా భారీ సక్సెస్‌ను మాత్రం అందుకోలేకపోతోన్నాడు మ్యాచో స్టార్ గోపీచంద్. కెరీర్ ఆరంభం నుంచి కొన్ని విజయాలను అందుకున్నా.. వాటిని భారీ స్థాయికి చేర్చలేకపోయాడు. అయినప్పటికీ ప్రయత్నాలను మాత్రం ఆపకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కానీ, ఈ మధ్య కాలంలో అతడికి అంతగా కలిసి రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ టాలెంటెడ్ హీరో 'రామబాణం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్, థియేటర్ల కౌంట్‌ను మీరే చూసేయండి!

రామబాణంతో వస్తున్న గోపీచంద్:గోపీచంద్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'రామబాణం'. శ్రీవాస్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇందులో డింపుల్ హయాతి హీరోయిన్‌గా నటించగా.. జగపతి బాబు, కుస్భూ సుందర్, తరుణ్ రాజ్, నాజర్, సచిన్ ఖేడ్కర్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు.

Gopichand Starrer Ramabanam Movie Pre Release Business and Theaters Count

అలాంటి స్టోరీ.. కమర్షియల్‌గానే:స్వచ్చమైన ఆహారం, మంచి బట్టలను అందరికీ అందేలా చేయాలని చూసే ఓ వ్యక్తికి ఎదురైన సమస్యలను.. ఆ ఫ్యామిలీకి చెందిన హీరో ఎలా పరిష్కరించాడు అనే కథతో తెరకెక్కిన చిత్రమే 'రామబాణం'. కుటుంబ విలువలకు కమర్షియల్ అంశాలను జోడించి తెరకెక్కించిన ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్లకు భారీ రెస్పాన్స్ రావడంతో దీనిపై అంచనాలు పెరిగాయి.

Gopichand Starrer Ramabanam Movie Pre Release Business and Theaters Count

భారీ ప్రమోషన్స్.. ఫుల్ సందడి:గోపీచంద్ - శ్రీవాస్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇప్పటికే చాలా ఈవెంట్లు చేసింది. అలాగే, ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూలు కూడా చేసుకున్నారు. ఇక, గురువారం సాయంత్రమే అమెరికాలో ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. దీంతో ఈ సినిమా సందడి కనిపిస్తోంది.

Gopichand Starrer Ramabanam Movie Pre Release Business and Theaters Count

రామబాణం సినిమా బిజినెస్:మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన 'రామబాణం' మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీని నుంచి ప్రతి పాటకు, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని ఈ సినిమాకు రూ. 14.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

Gopichand Starrer Ramabanam Movie Pre Release Business and Theaters Count

అన్ని కోట్లు వస్తేనే మూవీ హిట్:గోపీచంద్‌కు ఈ మధ్య కాలంలో పెద్దగా హిట్లు రావట్లేదన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ 'రామబాణం' మూవీకి బిజినెస్ భారీగానే జరిగింది. ఇక, ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 14.50 కోట్లు బిజినెస్‌ను జరుపుకుంది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 15.20 కోట్లుగా నమోదైంది. అంటే.. ఇంత మొత్తం వస్తేనే ఇది హిట్ స్టేటస్ చేరుతుంది.

Gopichand Starrer Ramabanam Movie Pre Release Business and Theaters Count

ఎక్కువ థియేటర్లలో విడుదల:'రామబాణం' మూవీకి ఓవరాల్‌గా థియేటర్లు మంచిగానే లభించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని నైజాంలో 210, సీడెడ్‌లో 110, ఆంధ్రా ప్రాంతంలోని అన్ని ఏరియాల్లో కలిపి 300 థియేటర్లలో విడుదల కాబోతుంది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 60, ఓవర్సీస్‌లో 160 థియేటర్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా 840 - 850 థియేటర్లలో ఇది రిలీజ్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X