Seetimaarr 10 Days collections: మళ్లీ పుంజుకున్న సీటీమార్.. 12 కోట్ల టార్గెట్.. వచ్చింది ఎంతంటే!
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అవుతోన్నా.. బ్లాక్ బస్టర్ హిట్లను మాత్రం పెద్దగా సొంతం చేసుకోలేకపోయాడు మాచో స్టార్ గోపీచంద్. కెరీర్ ఆరంభంలో పలు విజయాలను అందుకున్న అతడు.. చాలా కాలంగా వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు.
ఇందులో భాగంగానే ఇటీవలే 'సీటీమార్' అనే సినిమాలో నటించాడు. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఆరంభంలోనే పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది. కానీ, క్రమంగా కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. రూ. 12 కోట్ల టార్గెట్‌తో వచ్చిన ఈ సినిమా పది రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం పదండి!

‘సీటీమార్' అంటూ వచ్చిన గోపీచంద్
గోపీచంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కించిన చిత్రం 'సీటీమార్'. దీన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిత్తూరి దీన్ని నిర్మించారు. తమన్నా హీరోయిన్‌గా నటించగా.. భూమిక కీలక పాత్రను పోషించింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఫుల్ లెంగ్త్ మాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో భారీ స్థాయిలో రిలీజ్ అయింది.

సినిమా బిజినెస్ ఎక్కడ ఎంత జరిగింది?
మీడియం రేంజ్ హీరోలతో పోలిస్తే గోపీచంద్‌కు తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ కొంచెం తక్కువనే చెప్పాలి. అయితే, 'సీటీమార్'కు మాత్రం నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో రూ. 5 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు బిజినెస్ జరిగింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ. 11.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

10వ రోజు ఎక్కడ.. ఎంత వచ్చిందంటే?
'సీటీమార్' మూవీ కలెక్షన్లు పదవ రోజు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పుంజుకున్నాయి. ఆరంభంలో మంచి కలెక్షన్లను అందుకున్న ఈ సినిమా.. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలోనే తొమ్మిదో రోజు కేవలం రూ. 22 లక్షలు మాత్రమే వచ్చాయి. అయితే, పదవ రోజు మాత్రం ఈ సినిమా మరోసారి సత్తా చాటింది. దీంతో దీనికి రూ. 34 లక్షల షేర్ వసూలు అయింది.

10 రోజులకు కలిపి ఎంత రాబట్టిందంటే
ఆరంభంలో సత్తా చాటిన 'సీటీమార్' మూవీ 10 రోజులకు కలిపి నైజాంలో రూ. 2.51 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.78 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.25 కోట్లు, ఈస్ట్‌లో రూ. 96 లక్షలు, వెస్ట్‌లో రూ. 57 లక్షలు, గుంటూరులో రూ. 1.03 కోటి, కృష్ణాలో రూ. 56 లక్షలు, నెల్లూరులో రూ. 47 లక్షలతో.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 9.13 కోట్లు షేర్, రూ. 15.20 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వసూళ్లు ఎంత
రెండు రాష్ట్రాల్లో పది రోజుల్లో రూ. 9.13 కోట్లు షేర్ రాబట్టిన గోపీచంద్ 'సీటీమార్' మూవీ.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 35 లక్షలు, ఓవర్సీస్‌లో (అమెరికాలో ప్రదర్శించలేదు) రూ. 8 లక్షలు వసూలు చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పది రోజుల్లో ఈ చిత్రం రూ. 9.56 కోట్లు షేర్, రూ. 16.20 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. తద్వారా టార్గెట్‌కు మరింత చేరువ అయింది.
Recommended Video

మూవీ టార్గెట్ ఎంత? ఇంక ఎంతొస్తే హిట్
మాచ్ స్టార్ గోపీచంద్ నటించిన 'సీటీమార్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కలిపి (అమెరికాలో లేదు) రూ. 11.50 కోట్లు మేర వ్యాపారం జరిగింది. దీంతో బ్రేక్ ఈవెంట్ టార్గెట్ రూ. 12 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ చిత్రం పది రోజుల్లో రూ. 9.56 కోట్లు వసూలు చేసింది. అంటే.. మరో రూ. 2.44 కోట్లు వసూలు చేస్తేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications











