Seetimaarr 2 Days collections: గోపీచంద్ కలెక్షన్ల ఊచకోత.. రెండు రోజుల్లోనే అన్ని కోట్లా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సెకెండ్ వేవ్ తర్వాత చాలా సినిమాలు విడుదల కావాల్సి ఉన్నా.. ప్రతికూల పరిస్థితుల వల్ల దర్శక నిర్మాతలు ధైర్యం చేయడం లేదు. దీంతో ఇటీవలి కాలంలో చిన్న సినిమాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో రెండు మూడు మినహా మిగిలినవన్నీ నిరాశనే మిగిల్చాయి. ఈ నేపథ్యంలో విడుదలైన భారీ చిత్రమే 'సీటీమార్'. చాలా కాలంగా హిట్ కోసం వేచి చూస్తోన్న గోపీచంద్ నటించిన ఈ మూవీ భారీ అంచనాల విడుదలైంది. ఆరంభంలోనే మంచి టాక్‌ను అందుకుని సత్తా చాటింది. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఇక, 'సీటీమార్' రెండు రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరూ చూడండి!

 ‘సీటీమార్' అంటూ వచ్చిన గోపీచంద్

‘సీటీమార్' అంటూ వచ్చిన గోపీచంద్

మాచో హీరో గోపీచంద్ - తమన్నా జంటగా సంపత్ నంది తెరకెక్కించిన చిత్రమే 'సీటీమార్'. భూమిక చావ్లా ఇందులో కీలక పాత్రను పోషించింది. అప్సరా రాణి ఓ స్పెషల్ సాంగ్‌ను చేసింది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిత్తూరి దీన్ని నిర్మించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం పండుగకు వచ్చింది.

మూవీ బిజినెస్ ఎక్కడ ఎంత జరిగింది?

మూవీ బిజినెస్ ఎక్కడ ఎంత జరిగింది?

మిగిలిన హీరోలతో పోలిస్తే గోపీచంద్‌కు తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ కొంచెం తక్కువనే చెప్పాలి. అయితే, 'సీటీమార్' మూవీకి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో రూ. 5 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు బిజినెస్ జరిగింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ. 11.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

సూపర్ రెస్పాన్స్.. భారీగా పెంచేశారుగా

సూపర్ రెస్పాన్స్.. భారీగా పెంచేశారుగా

హిట్ కోసం పరితపిస్తోన్న గోపీచంద్ నటించి 'సీటీమార్' మూవీకి ఆరంభంలోనేఅన్ని ప్రాంతాల్లో పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఫలితంగా చాలా ప్రాంతాల్లో థియేటర్లు, షోలను పెంచి మరీ చిత్రాన్ని ప్రదర్శించారు. ఇలా అన్ని ప్రాంతాల్లో ఆడియెన్స్ సీటీ కొట్టారు. దీంతో గోపీచంద్‌తో పాటు ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

రెండో రోజు ఎక్కడ ఎంత వచ్చిందంటే

రెండో రోజు ఎక్కడ ఎంత వచ్చిందంటే

'సీటీమార్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు కూడా భారీ స్పందన వచ్చింది. ఫలితంగా దీనికి నైజాంలో రూ. 54 లక్షలు, సీడెడ్‌లో రూ. 35 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 24 లక్షలు, ఈస్ట్‌లో రూ. 17.20 లక్షలు, వెస్ట్‌లో రూ. 10 లక్షలు, గుంటూరులో రూ. 18 లక్షలు, కృష్ణాలో రూ. 9 లక్షలు, నెల్లూరులో రూ. 7 లక్షలతో.. రూ. 1.74 కోట్లు షేర్, రూ. 3.03 కోట్లు గ్రాస్ వచ్చింది.

 రెండు రోజులకు కలిపి ఎక్కడ.. ఎంత?

రెండు రోజులకు కలిపి ఎక్కడ.. ఎంత?

మొదటి రోజు మాంచి ఓపెనింగ్స్ దక్కించుకున్న 'సీటీమార్' మూవీ రెండు రోజులకు కలిపి నైజాంలో రూ. 1.45 కోట్లు, సీడెడ్‌లో రూ. 90 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 54 లక్షలు, ఈస్ట్‌లో రూ. 44 లక్షలు, వెస్ట్‌లో రూ. 26 లక్షలు, గుంటూరులో రూ. 59 లక్షలు, కృష్ణాలో రూ. 28 లక్షలు, నెల్లూరులో రూ. 26 లక్షలతో.. రూ. 4.72 కోట్లు షేర్, రూ. 7.78 కోట్లు వసూలు చేసింది.

 ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వసూళ్లు ఇవి

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వసూళ్లు ఇవి

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో రూ. 4.72 కోట్లు షేర్ రాబట్టిన గోపీచంద్ 'సీటీమార్' మూవీ.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 18 లక్షలు, ఓవర్సీస్‌లో (అమెరికాలో ప్రదర్శించలేదు) రూ. 5 లక్షలు వసూలు చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 4.95 కోట్లు షేర్, రూ. 8.25 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. తద్వారా ఎన్నో రికార్డులను కూడా బద్దలు కొట్టేసింది.

Recommended Video

Hero Sai Dharam Tej యాక్సిడెంట్ పై స్పందించిన Actor Naresh || Filmibeat Telugu
టార్గెట్ ఎంత? ఇంకా ఎంత వస్తే హిట్?

టార్గెట్ ఎంత? ఇంకా ఎంత వస్తే హిట్?

గోపీచంద్ 'సీటీమార్' మూవీ విశేషంగా ప్రపంచ వ్యాప్తంగా మంచి బిజినెస్ జరుపుకుంది. దీంతో అన్ని ప్రాంతాల్లో కలిపి (అమెరికాలో లేదు) రూ. 11.50 కోట్లు మేర వ్యాపారం జరిగింది. దీంతో బ్రేక్ ఈవెంట్ టార్గెట్ రూ. 12 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ చిత్రం రెండు రోజుల్లో రూ. 4.95 కోట్లు వసూలు చేసింది. దీంతో మరో రూ. 7.05 కోట్లు వసూలు చేస్తే క్లీన్ హిట్‌ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X