Seetimaarr 3 Days collections: గోపీచంద్ భారీ ఎదురుదెబ్బ.. ఆదివారం షాకింగ్ కలెక్షన్లు

చాలా కాలంగా సరైన హిట్ కోసం వేచి చేస్తున్నాడు మాచో హీరో గోపీచంద్. ఈ క్రమంలోనే ఒకదాని తర్వాత ఒకటి ఇలా వరుస పెట్టి ఎన్నో సినిమాల్లో నటించాడు. కానీ, అవేమీ అతడికి విజయాన్ని మాత్రం అందించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే 'సీటీమార్' అనే సినిమాలో నటించాడు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టింది. అయితే, మూడో రోజైన ఆదివారం మాత్రం దీనికి ఎదురుదెబ్బ తగిలింది. ఇక, గోపీచంద్ సినిమా మొత్తంగా ఇప్పటి వరకూ ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

‘సీటీమార్' కొట్టాలని వచ్చిన గోపీచంద్

‘సీటీమార్' కొట్టాలని వచ్చిన గోపీచంద్

గోపీచంద్ - తమన్నా హీరో, హీరోయిన్లుగా సంపత్ నంది తెరకెక్కించిన చిత్రం 'సీటీమార్'. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిత్తూరి దీన్ని నిర్మించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భూమిక చావ్లా ఇందులో కీలక పాత్రను పోషించింది. అప్సరా రాణి ఓ స్పెషల్ సాంగ్‌ను చేసింది. ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింది.

సినిమా బిజినెస్ ఎక్కడ ఎంత జరిగింది?

సినిమా బిజినెస్ ఎక్కడ ఎంత జరిగింది?

టాలీవుడ్‌లోని టైర్ 2 హీరోల్లో గోపీచంద్‌కు తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ కొంచెం తక్కువనే చెప్పాలి. అయితే, 'సీటీమార్' మూవీకి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో రూ. 5 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు బిజినెస్ జరిగింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ. 11.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

మూడో రోజు ఎక్కడ ఎంత వచ్చిందంటే?

మూడో రోజు ఎక్కడ ఎంత వచ్చిందంటే?

'సీటీమార్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా దీనికి నైజాంలో రూ. 34 లక్షలు, సీడెడ్‌లో రూ. 34 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 19 లక్షలు, ఈస్ట్‌లో రూ. 20 లక్షలు, వెస్ట్‌లో రూ. 10 లక్షలు, గుంటూరులో రూ. 17 లక్షలు, కృష్ణాలో రూ. 9.30 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలతో.. రూ. 1.51 కోట్లు షేర్, రూ. 2.43 కోట్లు గ్రాస్ వచ్చింది.

మూడు రోజులకు కలిపి ఎంత రాబట్టింది

మూడు రోజులకు కలిపి ఎంత రాబట్టింది

మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ దక్కించుకున్న 'సీటీమార్' మూవీ మూడు రోజులకు కలిపి నైజాంలో రూ. 1.79 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.24 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 73 లక్షలు, ఈస్ట్‌లో రూ. 64 లక్షలు, వెస్ట్‌లో రూ. 36 లక్షలు, గుంటూరులో రూ. 76 లక్షలు, కృష్ణాలో రూ. 37 లక్షలు, నెల్లూరులో రూ. 34 లక్షలతో.. రూ. 6.23 కోట్లు షేర్, రూ. 10.21 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

‘సీటీమార్'కు మూడో రోజు ఎదురుదెబ్బ

‘సీటీమార్'కు మూడో రోజు ఎదురుదెబ్బ

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన 'సీటీమార్' చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మొదటి రోజు ఈ మూవీ భారీ స్థాయిలో రూ. 2.98 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు కూడా అదే రీతిలో రూ. 1.74 కోట్లు రాబట్టింది. ఇక, ఆదివారం ఇంకాస్త పెరుగుతుందన్న టాక్ వినిపించింది. కానీ, ఊహించని విధంగా రూ. 1.51 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వసూళ్లు ఎంత

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వసూళ్లు ఎంత

తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో రూ. 6.23 కోట్లు షేర్ రాబట్టిన గోపీచంద్ 'సీటీమార్' మూవీ.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 21 లక్షలు, ఓవర్సీస్‌లో (అమెరికాలో ప్రదర్శించలేదు) రూ. 6 లక్షలు వసూలు చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో రూ. 6.50 కోట్లు షేర్, రూ. 10.80 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. తద్వారా వీకెండ్‌ను గ్రాండ్‌గా ముగించిందీ చిత్రం.

Recommended Video

Seetimaarr Movie Team Vinayaka Chaviti Special Interview
మూవీ టార్గెట్ ఎంత? ఇంక ఎంతొస్తే హిట్?

మూవీ టార్గెట్ ఎంత? ఇంక ఎంతొస్తే హిట్?

'సీటీమార్' మూవీ విశేషంగా ప్రపంచ వ్యాప్తంగా మంచి బిజినెస్ జరుపుకుంది. దీంతో అన్ని ప్రాంతాల్లో కలిపి (అమెరికాలో లేదు) రూ. 11.50 కోట్లు మేర వ్యాపారం జరిగింది. దీంతో బ్రేక్ ఈవెంట్ టార్గెట్ రూ. 12 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ చిత్రం మూడు రోజుల్లో రూ. 6.50 కోట్లు వసూలు చేసింది. దీంతో మరో రూ. 5.50 కోట్లు వసూలు చేస్తే క్లీన్ హిట్‌ స్టేటస్‌ను అందుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X