Seetimaarr 4 Days collections: భారీగా కలెక్షన్స్ డ్రాప్.. ఈ సినిమా కూడా కొంప ముంచుతుందా?

చాలా కాలంగా సరైన హిట్ కోసం వేచి చేస్తున్న మాచో హీరో గోపీచంద్ తాజాగా సీటీమార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిజానికి లౌక్యం సినిమా తరువాత గోపీ అంతటి హిట్ అందుకోలేకపోయాడు. వరుసగా ఎన్నో సినిమాల్లో నటించాడు కానీ, అవేమీ గోపీకి హిట్ ను మాత్రం అందించ లేకపోయాయి.

అందుకే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో చేసిన సీటీమార్ సినిమా ఎన్నో అంచనాలతో విడుదల కాగా భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టింది. అయితే, మూడో రోజైన ఆదివారం మాత్రం దీనికి ఎదురుదెబ్బ తగిలింది, మరి నాలుగో రోజు పరిస్థితి ఎలా ఉంది? సీటీమార్ సినిమా మొత్తంగా ఇప్పటి వరకూ ఎంత వసూలు చేసిందో పరిశీలిద్దాం.

 హిట్ దాహంతో

హిట్ దాహంతో

గోపీచంద్ - తమన్నా, దిగాంగన సూర్య వంశీ హీరో, హీరోయిన్లుగా సంపత్ నంది రూపొందించిన 'సీటీమార్' సినిమాను దర్శకుడు పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ మీద సినిమాని నిర్మించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించగా భూమిక చావ్లా, రెహమాన్ ఇందులో కీలక పాత్రలలో నటించారు. పెప్సీ ఆంటీ అంటూ అప్సరా రాణి ఓ స్పెషల్ సాంగ్‌ చేయగా మొత్తం మీద సినిమా మాత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

బిజినెస్ ఎలా జరిగింది?

బిజినెస్ ఎలా జరిగింది?

టాలీవుడ్‌లో గోపీచంద్‌కు తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ కొంచెం తక్కువనే చెప్పచ్చు. అయితే ఆయన రేంజ్ లోనే ఈ సినిమాకు నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో రూ. 5 కోట్లు, కర్నాటక తో పాటు మిగతా ఇండియా మొత్తం మీద 50 లక్షల రూపాయల బిజినెస్ జరిగింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ. 11.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని చెప్పచ్చు. ఇక మొదటి ఆట నుంచే సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఎక్కడెక్కడ ఎంత కలెక్ట్ చేసిందంటే

ఎక్కడెక్కడ ఎంత కలెక్ట్ చేసిందంటే

ఇక నాలుగో రోజు ఈ సినిమా కలెక్షన్స్ లో డ్రాప్ బాగా కనిపించింది. ఇక నాలుగో రోజున సినిమాకి నైజాంలో రూ.19లక్షలు, సీడెడ్‌లో రూ. 14లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 14లక్షలు, ఈస్ట్‌లో రూ. 7 లక్షలు, వెస్ట్‌లో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 7 లక్షలు, కృష్ణాలో రూ.4 లక్షలు, నెల్లూరులో రూ.3 లక్షలతో.. రూ. 0.72 కోట్లు షేర్, రూ. 1.12 కోట్లు గ్రాస్ వచ్చింది.

ఇక మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ దక్కించుకున్న 'సీటీమార్' మూడు రోజులకు కలిపి నైజాంలో రూ. 1.98 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.38 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 87 లక్షలు, ఈస్ట్‌లో రూ. 71లక్షలు, వెస్ట్‌లో రూ. 40 లక్షలు, గుంటూరులో రూ. 83 లక్షలు, కృష్ణాలో రూ. 41లక్షలు, నెల్లూరులో రూ. 37 లక్షలతో.. రూ. 6.95 కోట్లు షేర్, రూ. 11.35 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

భారీ డ్రాప్స్

భారీ డ్రాప్స్

భారీ ఎన్నో అంచనాల నడుమ విడుదలైన 'సీటీమార్'కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మొదటి రోజు 2.98 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు కూడా అదే రీతిలో రూ. 1.74 కోట్లు రాబట్టడంతో ఆదివారం వీకెండ్ మరింత పెరుగుతుందన్న టాక్ వినిపించింది. కానీ, ఊహించని విధంగా రూ. 1.51 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక నాలుగో రోజు వీక్ డే కావడంతో కలెక్షన్స్ లో 55 శాతం డ్రాప్ కనిపిస్తోంది.

Recommended Video

Seetimaarr Movie Team Vinayaka Chaviti Special Interview
బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత సంపాదించాలంటే?

బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత సంపాదించాలంటే?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వసూళ్లు ఎంత తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో రూ.6.95కోట్లు షేర్ రాబట్టిన గోపీచంద్ 'సీటీమార్' మూవీ.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 27లక్షలు, ఓవర్సీస్‌లో (అమెరికాలో ప్రదర్శించలేదు) రూ. 7 లక్షలు వసూలు చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా నానలుగు రోజుల్లో రూ. 7.29కోట్లు షేర్, రూ. 12.10 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

అమెరికా మినహా [ప్రపంచ వ్యాప్తంగాసినిమా 11.50 కోట్లు మేర వ్యాపారం జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 12 కోట్లుగా చెబుతున్నారు, నాలుగు రోజుల్లో రూ. 6.95 కోట్లు వసూలు చేసింది. దీంతో మరో రూ. 5.05 కోట్లు వసూలు చేస్తే క్లీన్ హిట్‌ అని ట్రేడ్ వర్గాల వారు కూడా నిర్ధారించే అవకాశం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X